Dil Raju : సైలెన్స్ ప్లీజ్..! సమస్య పక్కదారి పడుతోందన్న దిల్ రాజు

రిప్రెజెంటేటివ్స్ లిస్ట్ పంపాలని ఏపీ సర్కారు కోరడంతోనే కమిటీని ఏర్పాటుచేశామని దిల్ రాజు తన ప్రెస్ చెప్పారు.

Dil Raju : సైలెన్స్ ప్లీజ్..! సమస్య పక్కదారి పడుతోందన్న దిల్ రాజు

Dil Raju 2

Dil Raju : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చర్చలు జరిపేందుకు ఫిలిం చాంబర్ తరఫున కమిటీ వేశామని చెప్పారు తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు. కొందరు సినీ నిర్మాతలతో కలిసి ఆయన హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వంతో కమిటీ చర్చించిన తరువాత మంచి మెసేజ్ వస్తుందని అశాభావం ఉందన్నారు. అప్పటి వరకూ ఎవరూ మాట్లాడొద్దని విజ్ఞప్తి చేశారు.

సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు దిల్ రాజు. సీఎం కేసీఆర్ సమయం ఇస్తే కలిసి ధన్యవాదాలు తెలుపుకుంటామన్నారు.
ఏపీలో సినిమా థియేటర్ల అంశంపై మీడియా సమన్వయం పాటించాలని కోరారు. తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో మీడియాదే కీలక పాత్ర అన్నారు.

Read Also : RRR : ‘ఆర్ఆర్ఆర్’కి వ్యాక్సిన్‌కి లింక్ పెట్టిన ఆర్జీవీ.. ప్రభుత్వం ఆర్జీవీ చెప్పింది చేయాలి అంటున్న నెటిజన్లు

టికెట్ రేట్లు, ఐదు షోలు సహా.. అన్ని సమస్యలకు ఫిలిం చాంబర్ కమిటీ పరిష్కారం చూపుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు దిల్ రాజు. అందరూ తలో మాట.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో.. సమస్య పక్క దారి పడుతుందని అన్నారు. హీరోలు ఓ మాట.. కొందరు నిర్మాతలు మరో మాట మాట్లాడుతుండటంతో ఇష్యూ డైవర్ట్ అవుతోందన్నారు. ఈ కమిటీని ఏపీ సర్కారు చర్చలకు ఆహ్వానిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

16మందితో ఏపీ సర్కారుకు లిస్ట్
రిప్రెజెంటేటివ్స్ లిస్ట్ పంపాలని ఏపీ సర్కారు కోరడంతోనే కమిటీని ఏర్పాటుచేశామని దిల్ రాజు తన ప్రెస్ చెప్పారు. మొత్తం ఐదుగురు నిర్మాతలు, ఐదుగురు డిస్ట్రిబ్యూటర్లు, ఆరుగురు ఎగ్జిబిటర్ల పేర్లు సెలెక్ట్ చేశామని తెలుగు ఫిలిం చాంబర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ 16 మందిలో ఐదుగురి పేర్లను ఏపీ సర్కారు సెలెక్ట్ చేయనుంది. ఈ ఐదుగురు సభ్యుల బృందంతోనే ఏపీ ప్రభుత్వం చర్చించనుంది.