Dil Raju : ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో దిల్ రాజు సమావేశం.. వేతనాలు కొలిక్కి వచ్చినట్టేనా??

తాజాగా ఫిల్మ్ ఛాంబర్ లో దిల్ రాజు అధ్యక్షతన ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో సినీ కార్మికుల వేతన సవరింపులపై జరిగిన సమావేశం ముగిసింది. ఈ సమావేశం తర్వాత దిల్ రాజు మాట్లాడుతూ...............

Dil Raju : ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో దిల్ రాజు సమావేశం.. వేతనాలు కొలిక్కి వచ్చినట్టేనా??

Dil Raju

Film Fedaration :  సినీ కార్మికుల వేతనాలు పెంచాలంటూ రెండు రోజులు సమ్మె చేసిన కార్మికులు ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ మధ్య జరిగిన చర్చల తర్వాత సమ్మెని విరమించి షూటింగ్స్ మొదలుపెట్టడానికి అంగీకరించారు. కార్మికుల వేతనాల పెంపు పై దిల్ రాజు అధ్యక్షతన ఓ కమిటీ వేసి సమావేశం ఏర్పాటు చేసి చర్చించి ఎంత పెంచాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

తాజాగా ఫిల్మ్ ఛాంబర్ లో దిల్ రాజు అధ్యక్షతన ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో సినీ కార్మికుల వేతన సవరింపులపై జరిగిన సమావేశం ముగిసింది. ఈ సమావేశం తర్వాత దిల్ రాజు మాట్లాడుతూ.. ”ఫిల్మ్ ఛాంబర్ లో ఫెడరేషన్ సభ్యులతో చర్చలు జరిపాము. సంతోషకరమైన వాతావరణంలో జరిగాయి. కార్మికుల వేతనాలు పెంచుతాము. మరికొన్ని మీటింగ్ ల తర్వాత మళ్ళీ పూర్తి వివరాలు తెలియజేస్తాము. సమావేశంలో ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నామో అవి మళ్ళీ వెల్లడిస్తాము” అని తెలిపారు.

Gopichand : ప్రభాస్ అడిగితే మళ్ళీ విలన్ క్యారెక్టర్ చేయడానికి రెడీ..

 

ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ.. ”ఈరోజు షూటింగ్ లు జరుగుతున్నాయి. దిల్ రాజ్ నేతృత్వంలో చర్చలు జరుగుతున్నాయి. అతి కొద్ది రోజుల్లోనే అంతిమ నిర్ణయం ఉంటుంది. సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయి” అని తెలిపారు.