Ponniyin Selvan II : నో డౌట్ సెకండ్ పార్ట్ కూడా దిల్ రాజే.. ఆ షేర్ సాధిస్తుందా?

కోలీవుడ్ స్టార్ క్యాస్ట్ తో తమిళుల చరిత్రకు సంబంధించిన కథతో వచ్చిన సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1). ఈ మూవీ రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ పార్ట్ ఏప్రిల్ లో రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

Ponniyin Selvan II : నో డౌట్ సెకండ్ పార్ట్ కూడా దిల్ రాజే.. ఆ షేర్ సాధిస్తుందా?

Dil Raju releases Ponniyin Selvan II also

Ponniyin Selvan II : తమిళుల చరిత్రకు సంబంధించిన కథతో గత ఏడాది ఆడియన్స్ సెప్టెంబర్ లో ముందుకు వచ్చిన సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1). ఈ మూవీలో విక్రమ్ (Vikram), ఐశ్వర్య బచ్చన్ (Aishwarya Rai Bachchan), జయం రవి, కార్తీ (Karthi), త్రిష (Trisha), ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రల్లో నటించారు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఇండియన్ సూపర్ హిట్టు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కాగా ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే.

PS1: పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి బుల్లితెర ప్రేక్షకుల ఝలక్..!

గతంలోనే PS2 ని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక సినిమా విడుదల దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు. మార్చి 29న థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కాగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రైట్స్ తెలుగు రైట్స్ ని దిల్ రాజు (Dil Raju) దక్కించుకున్నాడు. అయితే సెకండ్ పార్ట్ ని దిల్ రాజు రిలీజ్ చేయడం లేదంటూ కొన్నిరోజులుగా వార్తలు వినిపించాయి.

PS-2 Movie: ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకున్న పొన్నియిన్ సెల్వన్-2

తాజాగా ట్రైలర్ అప్డేట్ ని దిల్ రాజు సంస్థ తమ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తెలియజేయడంతో.. ఆ వార్తలో నిజం లేదని తేలిపోయింది. కాగా ఈ సినిమాని తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేశాడు. ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ మూవీని మద్రాస్ టాకీస్ పతాకం పై మణిరత్నం, లైకా ప్రొడక్షన్స్ పతాకం పై సుబాస్కరన్ సంయుక్తంగా నిర్మించారు. రెండు భాగాలకు గాను దాదాపు 500 కోట్లు ఖర్చు అయ్యింది. ఫస్ట్ పార్ట్ కి 250 కోట్ల షేర్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ తో మరో 250 షేర్ సాదించాలి.