Ram Charan: చరణ్ కోసం దిల్ రాజు భారీగా ఖర్చు పెడుతున్నాడుగా! | Dil Raju Spending Huge Amount For Ram Charan Movie

Ram Charan: చరణ్ కోసం దిల్ రాజు భారీగా ఖర్చు పెడుతున్నాడుగా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, తన పర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. ఇక ఈ సినిమాల తరువాత చరణ్ ప్రస్తుతం...

Ram Charan: చరణ్ కోసం దిల్ రాజు భారీగా ఖర్చు పెడుతున్నాడుగా!

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, తన పర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. ఇక ఈ సినిమాల తరువాత చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా వైజాగ్‌లో ఓ షెడ్యూల్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

Ram Charan: శంకర్ సినిమాలో చరణ్ అలా కనిపిస్తాడా..?

ఇక్కడ చరణ్ పాత్రకు సంబంధించి కొన్ని కీలక సన్నీవేశాలను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. అయితే చరణ్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్‌తో వైజాగ్ షూటింగ్ లొకేషన్‌కు అభిమానుల భారీ సంఖ్యలో వస్తుండటంతో వారిని ఆపేందుకు ఏకంగా 200 మంది బౌన్సర్లను చిత్ర యూనిట్ వాడుకుంటోందట. ఆర్కె బీచ్‌లో కొన్ని కీలక సన్నీవేశాలను చిత్రీకరిస్తుండటంతో అక్కడ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నట్లు తెలుస్తోంది. వారిని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారిందని చిత్ర యూనిట్ అంటోంది.

Ram Charan: నేపాల్‌లో చరణ్ క్రేజ్.. ఏకంగా ఫ్రంట్ పేజీలో ఫోటో!

అయితే సెట్స్‌లో షూటింగ్ చేయాలని పలువురు సూచిస్తున్నా, దర్శకుడు శంకర్ మాత్రం రియల్ లొకేషన్స్‌లోనే షూటింగ్ జరపాలని పట్టుపడుతున్నాడట. దీంతో దిల్ రాజు జేబుకు బాగా చిల్లుపడుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.200 కోట్ల భారీ రెమ్యునరేషన్‌తో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేసిన చిత్ర యూనిట్, అంతకు మించిన ఖర్చు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమా ముగిసే సరికి ఎంతమేర ఖర్చు అవుతుందో అని దిల్ రాజు లెక్కలు వేస్తున్నాడట.

×