Dil Raju : నా 25 ఏళ్ల కెరీర్‌లో సమంత మూవీ.. పెద్ద షాక్ ఇచ్చింది.. దిల్ రాజు!

వారసుడు సినిమాతో ఈ ఏడాదిని సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ చేసిన దిల్ రాజుకి సమంత సినిమా భారీ షాక్ ఇచ్చిందట. తన 25 ఏళ్ళ కెరీర్ లో..

Dil Raju : నా 25 ఏళ్ల కెరీర్‌లో సమంత మూవీ.. పెద్ద షాక్ ఇచ్చింది.. దిల్ రాజు!

Dil Raju viral comments on Samantha Shaakuntalam

Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ఏడాదిని భారీ సక్సెస్ తో స్టార్ట్ చేశాడు. తమిళ స్టార్ హీరో విజయ్ తో వరిసు (Varisu) సినిమాని నిర్మించాడు. ఈ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దిల్ రాజు.. ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని సంచలనం సృష్టించాడు. తమిళంలో అడుగు పెడుతూనే అక్కడ స్టార్ హీరోకి కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ అందించడంతో కోలీవుడ్ లో కూడా దిల్ రాజుకి ఇక తిరుగులేదు అనుకున్నారు. అయితే టాలీవుడ్ లో మాత్రం దిల్ రాజు గట్టి షాక్ తగిలింది. సమంత (Samantha) సినిమా తనకి పెద్ద ఝలక్ ఇచ్చిందంటూ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Kushi : ఖుషీ సమంత కొత్త లుక్ రిలీజ్.. పేస్ మారిపోయింది అంటున్న నెటిజెన్లు..

సమంత నటించిన మైథిలాజికల్ మూవీ శాకుంతలం (Shaakuntalam) ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమాని గుణశేఖర్ నిర్మించగా దిల్ రాజు సహా నిర్మాతగా వ్యవహరించాడు. మూవీ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తానే తీసుకోని రిలీజ్ చేశాడు. మూవీ రిజల్ట్ తేడా కొట్టడంతో భారీగా నష్టపోయినట్లు చెప్పుకొచ్చాడు. తన 25 ఏళ్ల కెరీర్‌లో శాకుంతలం ఒక పెద్ద షాక్ ఇచ్చింది అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

Game Changer : నేషనల్ అవార్డు విన్నర్ స్టంట్ మాస్టర్‌తో రామ్ చరణ్ పోరాటం.. పిక్ లీక్!

కాగా దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) గేమ్ చెంజర్ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం దిల్ రాజు సంస్థలో 50వ సినిమాగా వస్తుంది. దీంతో ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోని నిర్మిస్తున్నాడు. దాదాపు 170 కోట్ల బడ్జెట్ తో గేమ్ చెంజర్ ని తెరకెక్కిస్తున్నాడు. తమిళ దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండగా, మరో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కథని అందిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీలోని క్లైమాక్స్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఆగష్టు నెలలో క్లారిటీ ఇస్తామంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు.