Dil Raju : కొడుకుని ఎత్తుకొని మురిసిపోతున్న దిల్ రాజు.. వైరల్ గా మారిన ఫొటో..
కరోనా లాక్ డౌన్ సమయంలో తన దూరపు బంధువు అయిన తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు దిల్ రాజు. గతంలో తేజస్విని ప్రెగ్నెంట్ అనే న్యూస్..............

Dil Raju : డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి దిల్ సినిమాతో నిర్మాతగా మారి విజయం సాధించి ఇప్పుడు టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాత, అగ్ర డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగాడు దిల్ రాజు. కొన్నేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత ఆరోగ్య సమస్యలతో మరణించడంతో తన కూతురి ఒత్తిడితో మరో వివాహం చేసుకున్నాడు.
కరోనా లాక్ డౌన్ సమయంలో తన దూరపు బంధువు అయిన తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు దిల్ రాజు. గతంలో తేజస్విని ప్రెగ్నెంట్ అనే న్యూస్ బయటకి వచ్చినా దీనిపై దిల్ రాజు క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల తేజస్వి పండంటి బాబుకి జన్మనిచ్చింది. దీంతో 50 ఏళ్ళ వయసులో దిల్ రాజు మరోసారి తండ్రి అవ్వడంతో టాలీవుడ్ ప్రముఖులు దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Suchendra Prasad : పవిత్ర నా భార్య.. నరేష్ ఎవరో తెలీదు..
తాజాగా దిల్ రాజు హాస్పిటల్ లో తన కొడుకుని ఎత్తుకొని దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హాస్పిటల్ లో దిల్ రాజు తన వారసుడిని ఎత్తుకొని మురిసిపోతున్నారు. పక్కనే వైఫ్ తేజస్విని కూడా ఉంది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.