Varisu : రంజితమే సాంగ్‌కి దిల్ రాజు మనవరాలు డాన్స్.. ఫిదా అయిన విజయ్!

తమిళ హీరో విజయ్ తో దిల్ రాజు తెరకెక్కించిన 'వరిసు' సినిమా సూపర్ హిట్టు కావడంతో నేడు దిల్ రాజు ఇంటిలో సక్సెస్ పార్టీ నిర్వహించాడు. ఈ పార్టీలో దిల్ రాజు మనవరాలు రంజితమే సాంగ్‌కి వేసిన స్టెప్పులు చూసి విజయ్ ఫిదా అయ్యిపోయాడు.

Varisu : రంజితమే సాంగ్‌కి దిల్ రాజు మనవరాలు డాన్స్.. ఫిదా అయిన విజయ్!

Varisu

Varisu : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తూ చేస్తున్న సినిమా ‘వరిసు’. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాకి సంగీతం అందించాడు. తెలుగులో ఈ సినిమా వారసుడు టైటిల్ తో రిలీజ్ అయ్యింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చితం తమిళనాట బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా తెలుగులో మిక్స్డ్ టాక్ తో హిట్టు దిశగా దూసుకుపోతుంది. కమర్షియల్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా.. అటు మాస్ ఆడియన్స్ ఇటు క్లాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి చూసింది.

Varisu: విజయ్ ‘వారిసు’ ఓటీటీ స్ట్రీమింగ్.. డేట్ ఫిక్స్ చేశారా..?

కేవలం ఏడు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు రూ.210 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. సినిమా సూపర్ హిట్టుగా నిలవడంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే నిర్మాత దిల్ రాజు
హైదరాబాద్ లోని తన ఇంటి వద్ద గ్రాండ్ సక్సెస్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి డైరెక్టర్ వంశీ పైడిపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరో విజయ్ తో పాటు దిల్ రాజు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దీంతో ఈ సెలెబ్రేషన్స్ లో హీరో విజయ్, దిల్ రాజు కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగి సందడి చేశాడు.

కాగా ఈ పార్టీలో దిల్ రాజు మనవరాలు ఇషిత చేసిన సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా హిట్టులో రంజితమే సాంగ్ చాలా కీ రోల్ ప్లే చేసింది అనే చెప్పాలి. ఈ సాంగ్ తల్లి కడుపులో ఉన్న పిల్లలు చేత కూడా చిందులు వేయిస్తుంది. తాజాగా సక్సెస్ పార్టీలో దిల్ రాజు మనవరాలు ఇషిత ఈ పాటకి వేసిన స్టెప్పులు చూసి హీరో విజయ్ ఫిదా అయ్యిపోయాడు. దీంతో తనని ఎత్తుకొని ముద్దాడుతూ ఫోటోలు దిగాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.