Dimple Hayathi : DCP ఉద్దేశం వేధించడం.. మేము లీగల్‌గా ఫైట్ చేస్తాం.. డింపుల్ హయతి లాయర్!

హైదరాబాద్ DCP తో హయతి గొడవ. ఆమె పై తప్పుడు కేసు పెట్టరంటున్న హయతి లాయర్.. లీగల్ గా ఫైట్ చేస్తామంటూ వెల్లడించాడు.

Dimple Hayathi : DCP ఉద్దేశం వేధించడం.. మేము లీగల్‌గా ఫైట్ చేస్తాం.. డింపుల్ హయతి లాయర్!

Dimple Hayathi is going to take legal action on hyderabad DCP

Dimple Hayathi : టాలీవుడ్ యాక్ట్రెస్ డింపుల్ హయతి పై నేడు పోలీస్ స్టేషన్ కేసు నమోదు అవ్వడం సినీ పరిశ్రమలో సంచలనం అయ్యింది. డింపుల్ హయతి తన బాయ్ ఫ్రెండ్ విక్టర్ డేవిడ్ తో కలిసి జూబ్లీహిల్స్‌ లో ఓ అపార్ట్మెంట్ లో ఉంటుంది. అదే అపార్ట్మెంట్ లో హైదరాబాద్ (Hyderabad) ట్రాఫిక్ DCP రాహుల్ హెగ్డే కూడా నివసిస్తున్నారు.

అయితే గత కొన్ని రోజులుగా డింపుల్ పార్కింగ్ స్థలం విషయంలో ఆ DCP తో గొడవ పడుతుందని, అంతేకాకుండా ప్రభుత్వ వాహనాన్ని కూడా డామేజ్ చేసేలా ప్రవర్తిచిందని, ఎంత చెప్పిన వినకపోయావడంతో ఆమె పై నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో DCP డ్రైవర్ ఫిర్యాదు చేశాడని ఈరోజు (మే 23) ఉదయం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Dimple Hayathi : హీరోయిన్ డింపుల్ హయతిపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలుసా?

డింపుల్ మరియు ఆమె స్నేహితుడి పై 353, 341, 279 సెక్షన్‌ల కింద కేసు నమోదు అవ్వడంతో వారిద్దర్నీ పోలీస్ స్టేషన్ కి పిలిపించి హెచ్చరించి పంపించారు పోలీసులు. దాదాపు 4 గంటలు పాటు హయతిని పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టారు. ఇక దీని పై హయతి రియాక్ట్ అవుతూ.. “అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పులని దాచలేరు” అంటూ ట్వీట్ చేసింది. తాజాగా తన లాయర్ ద్వారా న్యాయపోరాటం చేస్తాను అంటుంది.

Dimple Hayathi : పోలీస్ కేసు నమోదుపై సెటైరికల్ గా స్పందించిన డింపుల్ హయతి.. ట్వీట్స్ వైరల్..

డింపుల్ హయతి తరుపు లాయర్ పాల్ సత్యనారాయణ మాట్లాడుతూ.. “డింపుల్ హయతి పై తప్పుడు కేసుని పెట్టారు. DCP ప్రభుత్వ ప్రాపర్టీని దుర్వినియోగం చేస్తూ ఎక్కడి నుంచో సిమెంట్ బ్రిక్స్ ని అపార్ట్మెంట్ లోకి తీసుకు వచ్చారు. అవి కారు పార్కింగ్ లో అడ్డుగా ఉండడం వలన.. ఆ విషయం పై రెండు నెలలుగా డింపుల్ డీసీపీని ప్రశ్నిస్తూ వస్తున్నారు. కానీ ఆయన సమాధానం ఇవ్వకుండా డింపుల్ తో చాలాసార్లు రాష్ గా మాట్లాడారు. డింపుల్ కాలుతో కారుని తన్నినట్లు చెప్పుకొచ్చారు. కానీ ఆమె తన్నింది కోన్స్ ని. తన పార్కింగ్ ప్లేస్ లో కోన్స్ పెట్టడంతో ఆమె అసహనంతో కోన్స్ ని కాలుతో తన్నారు” అంటూ చెప్పుకొచ్చాడు.

“నిజానికి DCP పై కేసు పెడతానని డింపుల్ మొదటిగా బెదిరించారు. కానీ ఈలోపే డిసిపి తన డ్రైవర్ తో ఆమె పై కేసుని నమోదు చేయించారు. పోలీస్ స్టేషన్ కి రప్పించి 4 గంటలు పాటు కూర్చోబెట్టారు. ఆమె కూడా పిర్యాదు చేస్తాను అంటే కంప్లైంట్ తీసుకోలేదు. DCP ముఖ్య ఉద్దేశం ఆమెను వేధించడమే. ఆడపిల్ల అని కూడా చూడకుండా ఆమె మీదకు వెళ్లి మరి మాట్లాడేవారు. ఒక డీసీపీ స్థాయి వ్యక్తికి ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? అసలు పోలీస్ క్వార్టర్స్ లో ఉండకుండా ప్రైవేట్ అపార్ట్మెంట్ లో DCP ఎందుకు ఉంటున్నాడు? వీటన్నిటి పై మేము లీగల్ గా ఫైట్ చేస్తాం” అంటూ వెల్లడించాడు.