Dimple Hayathi : తన పై కేసుని కొట్టేయాలి.. హైకోర్టుని ఆశ్రయించిన డింపుల్..

డింపుల్ హయతి పై ఇటీవల పోలీస్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు హైకోర్టుకి చేరింది. తన పై కేసుని కొట్టేయాలి..

Dimple Hayathi : తన పై కేసుని కొట్టేయాలి.. హైకోర్టుని ఆశ్రయించిన డింపుల్..

Dimple Hayathi Rahul Hegde car case judgement in high court

Dimple Hayathi : టాలీవుడ్ యాక్ట్రెస్ డింపుల్ హయతి పై ఇటీవల పోలీస్ కేసు నమోదు అయిన సంగతి అందిరికి తెలిసిందే. హైదరాబాద్ (Hyderabad) ట్రాఫిక్ DCP రాహుల్ హెగ్డే వాహనం పై దాడి చేసినందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో DCP డ్రైవర్.. డింపుల్ మరియు ఆమె స్నేహితుడి పై మే 23న ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె పై 353, 341, 279 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం డింపుల్ హయతిని స్టేషన్ కి పిలిపించి ఆమెను హెచ్చరించి పంపించారు.

Yash – Ranbir : అల్లు అరవింద్ నిర్మాణం.. యశ్ రావణుడు.. రణ్‌బీర్‌, అలియా సీతారాములు.. నిజమేనా?

ఇక ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. దీని పై డింపుల్ స్పందిస్తూ.. ‘అధికార దుర్వినియోగం చేస్తూ తన పై తప్పుడు కేసు పెట్టారంటూ’ అప్పుడు ట్వీట్ కూడా చేసింది. అంతేకాదు ఆ విషయం పై లీగల్ గా కూడా ఫైట్ చేస్తాం అని కూడా వెల్లడించింది. తాజాగా ఆమె హైకోర్టుని ఆశ్రయించింది. తన పై నమోదైన కేసుని కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఐపీఎస్ రాహుల్ హెగ్డే అధికారాన్ని ఉపయోగించుకొని తన డ్రైవర్ చేత తప్పుడు కేసు పెట్టారంటూ, తనని ఈ కేసులో అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలంటూ డింపుల్ కోర్టుని కోరింది.

Varun – Lavanya : వరుణ్ – లావణ్య ఎంగేజ్మెంట్ కన్‌ఫార్మ్.. మెగా టీం అఫిషియల్ నోట్!

అయితే డింపుల్ వ్యాఖ్యలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖండించారు. డింపుల్ తన BMW కారుతో ఐపీఎస్ వాహనాన్ని ఢీ కొట్టినట్లు కోర్టుకి తెలియజేస్తూ.. కారుని ఢీ కొట్టిన ఫోటోలను కోర్టు ముందు సబ్మిట్ చేశారు. అందుకు సంబంధించిన సీసీ టీవీ వీడియో కూడా తమ దగ్గర ఉన్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పుకొచ్చారు. అలాగే డింపుల్ హయాతికి సీఆర్​పీసీ 41ఏ నోటీసు కూడా పంపించినట్లు వెల్లడించారు.

ఇక ఇరు వాదనలు విన్న హైకోర్టు.. 41ఏ నిబంధనల ప్రకారమే డింపుల్ హయతి పట్ల పోలీసులు వ్యవహరించాలని, అలాగే నోటీసులకు స్పందించి డింపుల్ హయతి ఇన్వెస్టిగేషన్​కు హాజరు కావాలని ఆదేశించింది. మరి ఈ దుమారం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.