Atlee: తండ్రైన స్టార్ డైరెక్టర్ అట్లీ.. మగబిడ్డ పుట్టాడంటూ పోస్ట్!

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళంలో పలు సెన్సేషనల్ సినిమాలను తెరకెక్కించిన అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో కలిసి జవాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న అట్లీ, ఈ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ డైరెక్టర్ భార్య ప్రియా గర్భవతిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

Atlee: తండ్రైన స్టార్ డైరెక్టర్ అట్లీ.. మగబిడ్డ పుట్టాడంటూ పోస్ట్!

Atlee: తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళంలో పలు సెన్సేషనల్ సినిమాలను తెరకెక్కించిన అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో కలిసి జవాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న అట్లీ, ఈ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ డైరెక్టర్ భార్య ప్రియా గర్భవతిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

Atlee: తల్లిదండ్రులు కాబోతున్న తమిళ డైరెక్టర్ అట్లీ-ప్రియ దంపతులు

అయితే ఆమె తాజాగా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లుగా అట్లీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ప్రపంచంలో ఇలాంటి అనుభూతిని మాటల్లో వర్ణించలేనని.. తాను తండ్రిగా మారడంతో తన జీవితంలో సరికొత్త అధ్యయనం మొదలైందని ఆయన ఎమోషనల్ పోస్ట్ చేశాడు. తన భార్య ప్రియా ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని.. తల్లీకొడుకులు ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు.

కాగా అట్లీ, ప్రియాలు 2014లో వివాహం చేసుకోగా, వారు తరుచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తూ వచ్చారు. అట్లీ తండ్రైన విషయం తెలసుకుని పలువురు ఆయనకు, ఆయన భార్యకు శుభాకాంక్షలు తెలిజయేస్తున్నారు.