Republic: దేవాకట్టా మరో ప్రయోగం.. డైరెక్టర్ కామెంటరీతో ఓటీటీ స్ట్రీమింగ్!

ప్రస్థానం లాంటి సినిమాతో తనలో దాగున్న సమాజపు దృష్టిని బయటపెట్టిన దర్శకుడు దేవాకట్టా ఈ మధ్యనే మన వ్యవస్థలను నిలదీస్తూ రిపబ్లిక్ అనే సినిమాని తెరకెక్కించాడు.

Republic: దేవాకట్టా మరో ప్రయోగం.. డైరెక్టర్ కామెంటరీతో ఓటీటీ స్ట్రీమింగ్!

Republic

Republic: ప్రస్థానం లాంటి సినిమాతో తనలో దాగున్న సమాజపు దృష్టిని బయటపెట్టిన దర్శకుడు దేవాకట్టా ఈ మధ్యనే మన వ్యవస్థలను నిలదీస్తూ రిపబ్లిక్ అనే సినిమాని తెరకెక్కించాడు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు లాంటి సీనియర్ నటులు కూడా నటించిన ఈ సినిమా ఈ మధ్యనే థియేటర్లో విడుదలై విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదల కానుంది.

Evaru Meelo Koteeswarulu: నీకంటే కంప్యూటర్ బెటర్.. మహేష్-తారక్ ఫన్నీ ప్రోమో!

ఈ నెల 26న జీ 5లో ‘రిపబ్లిక్’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే.. ఈ డిజిటల్ రిలీజ్ తో దర్శకుడు దేవాకట్టా మరో ప్రయోగం చేపట్టనున్నాడు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే జీ 5.. డైరెక్టర్ కామెంటరీతో ‘రిపబ్లిక్’ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ విధంగా విడుదల చేస్తున్న తొలి ఓటీటీ వేదిక ‘జీ 5’ కాగా.. ఇలా విడుదల అవుతున్న తొలి సినిమా ‘రిపబ్లిక్’ కావడం విశేషం. సాధారణంగా ప్రేక్షకులు సినిమా చూస్తే.. విమర్శకులు సినిమా చూసి అందులో సన్నివేశాల గురించి విమర్శలు చేస్తారు.

Bheemla Nayak : ఇదీ పవర్‌స్టార్ స్టామినా.. రిలీజ్ తర్వాతే రచ్చ రంబోలానే..

అయితే, డైరెక్టర్ కామెంటరీ రిలీజ్ అంటే సినిమాలో ప్రతి సన్నివేశాన్ని డైరెక్టర్ ఏ కోణంలో రాసుకున్నాడో తానే స్వయంగా వివరించడం. అది ఆన్ స్క్రీన్ మీద ఎలా వచ్చిందో కూడా దర్శకుడే చెప్పడం డైరెక్టర్ కామెంటరీ రిలీజ్ అంటారు. అలా ఏ కోణంలో సినిమా తీశానన్నది దర్శకుడు కామెంటరీతో సినిమా చూపించేందుకు ముందుకొస్తే.. అటువంటి ప్రయత్నానికి ‘జీ 5’ ప్రసారం చేసేందుకు ముందుకొచ్చింది. సినిమా ఎడిటర్ ప్రవీణ్ కె.ఎల్, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ బీకేఆర్ కలిసి ‘రిపబ్లిక్’ విజువల్ టైమ్ లైన్ గురించి దేవ్ కట్టా డిస్కస్ చేశాడు. డైరెక్టర్ కామెంటరీతో సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.. లేదంటే ఎప్పటిలానే సినిమా చూడవచ్చు.