Satyadev : ఈ సినిమాకి నాథూరామ్‌ గాడ్సే కథకు ఎలాంటి సంబంధం లేదు.. పవన్ కోసం రాసిన సినిమా..

గోపి గణేష్ ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ.. ''ఈ సినిమాకి నాథూరామ్‌ గాడ్సే జీవిత కథకు ఎలాంటి సంబంధం లేదు. సినిమాలో ఓ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌..............

Satyadev : ఈ సినిమాకి నాథూరామ్‌ గాడ్సే కథకు ఎలాంటి సంబంధం లేదు.. పవన్ కోసం రాసిన సినిమా..

Godse Movie

Godse :  సత్యదేవ్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా గాడ్సే సినిమా జూన్ 17న రాబోతుంది. సమాజాన్ని ప్రశ్నించే ఓ వ్యక్తిగా సత్యదేవ్ ఇందులో కనపడనున్నాడు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ జనాల్ని బాగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచింది. సత్యదేవ్ తో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా చేసిన డైరెక్టర్ గోపి గణేష్ ఇప్పుడు మరోసారి గాడ్సేతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ గోపి గణేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని పంచుకున్నారు. గోపి గణేష్ ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ.. ”ఈ సినిమాకి నాథూరామ్‌ గాడ్సే జీవిత కథకు ఎలాంటి సంబంధం లేదు. సినిమాలో ఓ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉంటుంది. అందులో హీరో చదివే రోజుల్లో ఓ నాటకం వేస్తాడు. ఆ నాటకంలో తను గాడ్సే పాత్ర పోషిస్తాడు. ఆ నాటకం చివర్లో బొమ్మ తుపాకీతో గాంధీ పాత్రధారిని కాల్చి చంపాలి. కానీ ఐ లవ్‌ గాంధీ. నేను కాల్చనని చెప్తాడు. అలా చెప్పిన వ్యక్తి పెద్దయ్యాక నిజం గన్స్‌ పట్టుకొని కొంతమందిని ఎందుకు కాల్చి చంపాడు? అతను ఆయుధం పట్టడానికి కారణాలేంటి? అనేదే సినిమా” అని అన్నారు.

Nithin : 20 ఏళ్ళ ప్రయాణం.. మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో..

అలాగే.. ”గాడ్సే సినిమాని పవన్‌ కల్యాణ్‌ని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాను. అయితే ఈ కథ ఆయనకు చెప్పే అవకాశం రాలేదు. కానీ గాడ్సే సినిమా పవన్‌ కళ్యాణ్ కి చూపించే ప్రయత్నం చేస్తున్నాం’’ అని తెలిపారు.