Hanu Raghavapudi: సీతా రామం ఎఫెక్ట్.. రూటు మార్చిన హను రాఘవపూడి..?

ర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతా రామం’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌లు హీరోహీరోయిన్లుగా నటించగా, అందాల భామ రష్మిక మందన ఓ కీలక పాత్రలో నటించింది. హను రాఘవపూడి తన నెక్ట్స్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టు పనులు కూడా ముగించేశాడట ఈ డైరెక్టర్.

Hanu Raghavapudi: సీతా రామం ఎఫెక్ట్.. రూటు మార్చిన హను రాఘవపూడి..?

Director Hanu Raghavapudi Changes Genre For His Next Movie

Hanu Raghavapudi: దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతా రామం’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌లు హీరోహీరోయిన్లుగా నటించగా, అందాల భామ రష్మిక మందన ఓ కీలక పాత్రలో నటించింది. ఇక ఈ చిత్రాన్ని క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా హను రాఘవపూడి తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.

Sita Ramam : చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమా చూశాను.. సీతారామం సినిమాపై వెంకయ్యనాయుడు రివ్యూ..

ఈ సినిమా రిజల్ట్‌తో అందరూ హను రాఘవపూడిని మణిరత్నంతో పోల్చడం మొదలుపెట్టారు. అయితే ఒకే తరహా ఇమేజ్‌ను సొంతం చేసుకోవడం తనకు ఇష్టం లేదని అంటున్నాడు ఈ డైరెక్టర్. అందుకే తన నెక్ట్స్ ప్రాజెక్టును పూర్తిగా భిన్నమైన జోనర్‌తో తెరకెక్కించాలని చూస్తున్నాడట. హను రాఘవపూడి తన నెక్ట్స్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టు పనులు కూడా ముగించేశాడట ఈ డైరెక్టర్.

SitaRamam: యుద్ధంతో రాసిన ప్రేమ కథ ‘సీతా రామం’.. గ్లిమ్ప్స్ రిలీజ్!

అయితే, ఈసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కాకుండా ఓ హిస్టారికల్ ఫిక్షన్ కథను రెడీ చేశాడట. ఈ సినిమాలోని ఫిక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి లీడ్ యాక్టర్స్ వేటలో ఉన్నాడట హను. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలతో ఈ సినిమా కోసం ఆయన డిస్కషన్స్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని ముందు వరుసలో ఉండగా, ఆయన ఈ సినిమాకు ఓకే చెబుతాడా లేడా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉందట. మరి సీతా రామం ఎఫెక్ట్‌తో జోనర్‌ను మారుస్తున్న హను రాఘవపూడి, తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో తెరకెక్కిస్తాడో చూడాలి.