‘వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు’.. తారక్ ఫ్యామిలీ ఫోటోపై హరీష్ శంకర్ కామెంట్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ హోలీ ఫోటోపై యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

‘వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు’.. తారక్ ఫ్యామిలీ ఫోటోపై హరీష్ శంకర్ కామెంట్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ హోలీ ఫోటోపై యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (మంగళవారం) అభిమానులకు, ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలియచేసిన సంగతి తెలిసిందే. భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ రామ్‌లతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ తారక్ అందరికీ హోలీ విషెస్ తెలిపాడు తారక్. ఫ్యామిలీ అంతా వైట్ డ్రెస్‌లో ముఖానికి రంగులు పూసుకుని ఉన్న పిక్ ఆకట్టుకుంటోంది.

ఈ ఫోటోను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తారక్ ఫ్యామిలీ ఫోటోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభించింది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ ఫోటోపై స్పందించాడు. తనదైన శైలిలో ఎన్టీఆర్ చిన్న కొడుకు గురించి కామెంట్ చేశాడు. ‘ఎన్టీఆర్ చిన్న కొడుకు కెమేరా వైపు చూస్తున్న విధానం ఏదో చెబుతోంది.. వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు’.. అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు.

 

రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి తార‌క్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది. తర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో నటించనున్న సినిమా మే నుండి షూటింగ్ ప్రారంభం కానుంది.