లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

కోడి రామకృష్ణ కన్నుమూత

ఆయన మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఆ తర్వాత బాలకృష్ణతో తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మంగమ్మగారి మనవడు బిగ్గెస్ట్ హిట్. 

Publish Date - 9:30 am, Fri, 22 February 19

director kodi ramakrishna no more

ఆయన మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఆ తర్వాత బాలకృష్ణతో తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మంగమ్మగారి మనవడు బిగ్గెస్ట్ హిట్. 

మెగా డైరెక్టర్ కోడి రామకృష్ణ ఇక లేరు. అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన.. 2019, ఫిబ్రవరి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు కోడి రామకృష్ణ. సెంటిమెంట్ మూవీస్ తీయటంతో స్పెషలిస్ట్. కాలంతో మారుతూ.. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలను తీయటంలో ప్రత్యేకత చాటుకున్నారు. సినిమాల్లో గ్రాఫిక్స్ ఉపయోగించటంలోనూ ఆద్యుడిగా కీర్తిగడించారు. ఆయన మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఆ తర్వాత బాలకృష్ణతో తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మంగమ్మగారి మనవడు బిగ్గెస్ట్ హిట్. 
Read Also:సినీ పుత్రుడు : కోడి రామకృ‌ష్ణ నటుడిగా ప్రయత్నాలు

కోడి రామకృష్ణ అనగానే నుదట హెడ్ బ్యాండ్ కనిపిస్తూ ఉంటుంది. ఎర్రటి తిలకం దిద్దుకుని ఆధ్యాత్మికత ముఖం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పాలకొల్లులో జూలై 23వ తేదీన జన్మించిన కోడి రామకృష్ణ.. సినిమాలపై మక్కువతో మొదట మద్రాస్ వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో సినిమాలు తీసి హిట్ కొట్టారు. 100 సినిమాలకు దర్శకత్వం వహించి రికార్డ్ సృష్టించారు. అరంధతి, అమ్మోరు వంటి సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో కోడిరామకృష్ణ చురుకైన పాత్రను వహించారు. 

Read Also:స్టయిలిష్ డైరెక్టర్ : హెడ్ బ్యాండ్, వీరతిలకం, చేతికి దారాలు..
Read Also:దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ సినీ మైలురాళ్లు