Prabhas : ప్రభాస్‌తో ‘రాజా డీలక్స్’.. మారుతి ఏమన్నాడంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో ఓ క్రేజీ సినిమా రాబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..

Prabhas : ప్రభాస్‌తో ‘రాజా డీలక్స్’.. మారుతి ఏమన్నాడంటే..

Prabhas Maruthi

Prabhas: రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో ఓ క్రేజీ సినిమా రాబోతుంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను ప్రొడ్యూస్ చెయ్యబోతున్నారు.

Krishnam Raju : హ్యాపీ బర్త్‌డే ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు..

హారర్ కామెడీ జానర్‌లో రూపొందబోయే ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే క్యాచీ టైటిల్ పెట్టారు.. అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ మధ్యలో కాస్త గ్యాప్ చూసుకుని ఓ ఆర్నెళ్లలో ఈ మూవీని కంప్లీట్ చేస్తారని న్యూస్ స్ప్రెడ్ అవుతోంది.

Radhe Shyam : రెబల్ స్టార్ రేంజ్.. నార్త్‌లో బిగ్గెస్ట్ రిలీజ్..

దీని గురించి రీసెంట్‌గా డైరెక్టర్ మారుతి సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అయ్యారు. ‘నా తర్వాతి సినిమా గురించి, టైటిల్స్, జానర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, స్టార్ కాస్టింగ్ వంటి వాటి గురించి వార్తలు వస్తున్నాయి. టైం అన్నీ రివీల్ చేస్తుంది’.. అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మాచో హీరో గోపిచంద్‌తో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నారు మారుతి.