Director Maruthi : అలా చేస్తే పక్క భాషల నటుల్ని తెచ్చుకోవాల్సిన పని లేదు..

దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ''మనకి తెలుగులో చాలా మంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లకు తగిన క్యారెక్టర్స్‌ మనం రాసుకోగలిగితే వేరే భాషల నుంచి.............

Director Maruthi : అలా చేస్తే పక్క భాషల నటుల్ని తెచ్చుకోవాల్సిన పని లేదు..

Maruthi

Director Maruthi :  ఇటీవల మన సినిమాల్లో వేరే భాషల నటుల్ని ఎక్కువగా వాడుతున్నారు. వేరే భాషల నటుల్ని పెడితే అక్కడి భాషలో కూడా సినిమా మార్కెట్ అవుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది వేరే భాషల వాళ్ళని తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. కానీ కొంతమంది దర్శకులు అవసరం అయితే తప్ప వేరే భాష వాళ్ళని తీసుకోరు. మన తెలుగు వారికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలాంటివాళ్లలో డైరెక్టర్ మారుతి ముందు ఉంటారు.

గోపీచంద్, రాశిఖన్నా జంటగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా జులై 1న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాని దర్శకుడు మారుతీ తెరకెక్కించగా జీఏ2 పిక్చర్స్‌– యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్ పై బన్నీ వాసు, వంశీ నిర్మించారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ ముఖ్య అతిధిగా వచ్చారు. తాజాగా దర్శకుడు మారుతి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు.

Hollywood Movies : హాలీవుడ్ క్రేజీ సిరీస్ లకి ఎండ్ కార్డ్..

దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ”మనకి తెలుగులో చాలా మంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లకు తగిన క్యారెక్టర్స్‌ మనం రాసుకోగలిగితే వేరే భాషల నుంచి నటీనటులను తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు” అని అన్నారు. అలాగే ”సినిమా టికెట్‌ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులు థియేటర్ కి ఎక్కువగా రావట్లేదు. అందుకే పక్కా కమర్షియల్ సినిమాకి తక్కువ రేట్స్ పెట్టాము. ఓటీటీలో తొందరగానే వస్తుంది చూసేయొచ్చు అనుకుంటారేమో ఇప్పుడప్పుడే ఈ సినిమా ఓటీటీకి రాదు” అని తెలిపారు.