Director Maruthi : షూట్ గ్యాప్ లో.. ప్రభాస్ లంబోర్గిని కార్‌లో మారుతి చక్కర్లు.. వీడియో షేర్ చేసిన డైరెక్టర్ మారుతి..

ప్రభాస్ దగ్గర అత్యంత ఖరీదైన లంబోర్గిని కార్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్ లో హైదరాబాద్ రోడ్ల మీద చక్కర్లు కొడుతూ పలు సార్లు మీడియాకి చిక్కాడు ప్రభాస్. తాజాగా ఈ లంబోర్గిని కారులో డైరెక్టర్ మారుతి షికారుకు వెళ్ళాడు. ప్రభాస్ లంబోర్గిని కారుని డైరెక్టర్ మారుతి నడుపుతున్న వీడియోని మారుతి తన సోషల్ మీడియాలో .................

Director Maruthi : షూట్ గ్యాప్ లో.. ప్రభాస్ లంబోర్గిని కార్‌లో మారుతి చక్కర్లు.. వీడియో షేర్ చేసిన డైరెక్టర్ మారుతి..

Director Maruti Drove Prabhas Lamborghini car

Director Maruthi :  ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ K లాంటి పాన్ ఇండియా, భారీ బడ్జెట్ సినిమాలతో వరుసగా రాబోతున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇక సలార్, ప్రాజెక్టు K ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇన్ని భారీ ప్రాజెక్ట్స్ మధ్యలో మారుతి తో ఓ చిన్న సినిమా చేస్తున్నాడు ప్రభాస్.

మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేసే సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయకపోయినా సినిమా షూట్ మాత్రం జరుగుతుంది. ఇప్పటికే సినిమా షూట్ కి సంబంధించిన కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. దీంతో ఈ సినిమా కూడా ప్రభాస్ లైనప్ లో చేరింది. ప్రభాస్ గత సినిమా రాధేశ్యామ్ పరాజయం పాలవడంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా డైరెక్టర్ మారుతి ఓ ఆసక్తికర వీడియో షేర్ చేశాడు.

Gopichand Malineni : వీరసింహారెడ్డి చూసి రజినీకాంత్ ఫోన్ చేశారు.. మర్చిపోలేని అనుభవం అంటూ డైరెక్టర్ ట్వీట్..

ప్రభాస్ దగ్గర అత్యంత ఖరీదైన లంబోర్గిని కార్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్ లో హైదరాబాద్ రోడ్ల మీద చక్కర్లు కొడుతూ పలు సార్లు మీడియాకి చిక్కాడు ప్రభాస్. తాజాగా ఈ లంబోర్గిని కారులో డైరెక్టర్ మారుతి షికారుకు వెళ్ళాడు. ప్రభాస్ లంబోర్గిని కారుని డైరెక్టర్ మారుతి నడుపుతున్న వీడియోని మారుతి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోని షేర్ చేసి.. మేము ప్రేమ గురించి ప్రార్థించం, కేవలం కార్ల కోసమే ప్రార్థిస్తాం అని పోస్ట్ చేశాడు. ప్రభాస్ తో జరుగుతున్న సినిమా షూట్ గ్యాప్ లో మారుతి ఇలా చక్కర్లు కొడుతున్నాడని అంటున్నారు. ప్రభాస్ లంబోర్గిని కారుని మారుతి డ్రైవ్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రభాస్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా ఈ వీడియోకి కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మారుతీతో ప్రభాస్ సినిమా అప్డేట్స్ అడుగుతున్నారు.