Maruthi : టాలీవుడ్‌లో విషాదం.. స్టార్ డైరెక్టర్ తండ్రి మృతి..

ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాను అనే సంతోషంలో ఉన్న మారుతికి చెప్పలేనంత భాద కలిగించే సంఘటన జరిగింది. తాజాగా డైరెక్టర్ మారుతి ఇంట విషాదం నెలకొంది.........

Maruthi : టాలీవుడ్‌లో విషాదం.. స్టార్ డైరెక్టర్ తండ్రి మృతి..

Maruthi

Maruthi :  డిస్ట్రిబ్యూటర్‌గా, యాడ్స్‌ డిజైనర్‌గా పని చేసిన మారుతి ‘ఈ రోజుల్లో’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత ‘బస్‌ స్టాప్‌’ సినిమాతో మరో విజయాన్ని అందుకొని చిన్న సినిమాలతో పెద్ద విజయాన్ని అందుకున్నారు. ‘ప్రేమకథా చిత్రం’ సినిమాతో డైరెక్టర్ గా, నిర్మాతగా భారీ విజయం సాధించి స్టార్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో సెటిల్ అయ్యాడు. కామెడీ జోనర్ కి కేరాఫ్ అడ్రస్ గా చిన్న హీరోలకి పెద్ద సక్సెస్ ఇచ్చే డైరెక్టర్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నారు మారుతి. ప్రస్తుతం మారుతి ప్రభాస్ తో సినిమా చేయనున్నారు.

Prabhas : ప్రశాంత్ నీల్ సూపర్ ప్లాన్.. ‘సలార్’కి కూడా ఆ యంగ్ ఎడిటర్??

ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాను అనే సంతోషంలో ఉన్న మారుతికి చెప్పలేనంత భాద కలిగించే సంఘటన జరిగింది. తాజాగా డైరెక్టర్ మారుతి ఇంట విషాదం నెలకొంది. మారుతి తండ్రి దాసరి వనకుచలరావు నిన్న అర్ధరాత్రి కన్నుమూశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మారుతి స్వగృహంనందు ఆయన 76 ఏళ్ళ వయసులో వయోభారంతో తుదిశ్వాస విడిచారు. దీంతో మారుతి ఇంట్లో విషాదం అలుముకుంది. మారుతి తండ్రి మరణవార్త విని పలువురు సినీ ప్రముఖులు ఆయనను నివాళులు అర్పిస్తూ మారుతీని పరామర్శిస్తున్నారు.