Sandeep Raj : కలర్ ఫోటో డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన మారుతి.. ఎమోషన్ ప్లస్ కామెడీ??

ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళు, లేదా యూట్యూబర్స్ తోనే కలర్ ఫోటో సినిమా తెరకెక్కింది. మొదటి సినిమాతోనే సందీప్ రాజ్ అందర్నీ మెప్పించాడు. లవ్, మనుషుల కలర్ నేపథ్యంలో ఈ సినిమాని...............

Sandeep Raj : కలర్ ఫోటో డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన మారుతి.. ఎమోషన్ ప్లస్ కామెడీ??

Director Maruthi gives a chance to sandeep raj

Sandeep Raj :  కరోనా కాలంలో థియేటర్స్ లేని సందర్భంలో కలర్ ఫోటో అనే ఒక సినిమా ఓటీటీలో రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. విమర్శకుల నుంచి సైతం ఈ సినిమా ప్రశంసలు పొందింది. ఏకంగా ఈ సినిమా నేషనల్ అవార్డు సాధించింది. షార్ట్ ఫిలిమ్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే సుహాస్ ని హీరోగా, చాందిని చౌదరిని హీరోయిన్ గా పెట్టి కొత్త దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళు, లేదా యూట్యూబర్స్ తోనే కలర్ ఫోటో సినిమా తెరకెక్కింది. మొదటి సినిమాతోనే సందీప్ రాజ్ అందర్నీ మెప్పించాడు. లవ్, మనుషుల కలర్ నేపథ్యంలో ఈ సినిమాని అద్భుతంగా ఎమోషనల్ గా తెరకెక్కించారు. తాజాగా ఈ డైరెక్టర్ కి దర్శకుడు మారుతీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా కలర్ ఫోటో నిర్మాత సాయి రాజేష్ డైరెక్టర్ గా తెరకెక్కుతున్న ‘బేబీ’ సినిమాని డైరెక్టర్ మారుతి, SKN కలిసి మాస్ మూవీ మేకర్స్ అనే బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టిజర్ రిలీజ్ అయింది. బేబీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ”కొత్త వాళ్లకి అవకాశాలు ఇవ్వడానికి, కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి, మంచి మంచి కథలని మీ ముందుకి తీసుకురావడానికి ఈ బ్యానర్ ని మొదలుపెట్టాం. బేబీ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ట్యాలెంటెడ్ పర్సన్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్వరలోనే మా బ్యానర్ నుంచి మరిన్ని సినిమాలు వస్తాయి. మరింతమంది యువ దర్శకులకి ఛాన్సులు ఇస్తున్నాము. కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ తో త్వరలో మా సినిమా ఉంటుంది” అని తెలిపాడు.

Vaishnavi Chaitanya : సినిమా రిలీజ్ అవ్వకుండానే హీరోయిన్ గా మూడు సినిమాల ఛాన్స్ కొట్టేసిన తెలుగమ్మాయి..

దీంతో ఒక్క సినిమాతో, అది కూడా మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు సాధించి అందరి కళ్ళల్లో పడ్డాడు సందీప్ రాజ్. ఇప్పుడు మారుతి నిర్మాతగా ఈ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం, ఇండైరెక్ట్ గా మెగా కాంపౌండ్ లో పడ్డట్టే అని సందీప్ రాజ్ ని అభినందిస్తున్నారు. మరి కామెడీ సినిమాలతో మెప్పించే మారుతి, కలర్ ఫోటో లాంటి పూర్తి ఎమోషనల్ సినిమా తీసిన సందీప్ రాజ్ కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉండబోతుందో చూడాలి.