Project K : ప్రాజెక్ట్-K కోసం ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నాము.. దర్శకుడు నాగ్ అశ్విన్!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ప్రాజెక్ట్-K'. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజుకో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా ఇంటరాక్షన్ లో ఒక అభిమానికి వెల్లడించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Project K : ప్రాజెక్ట్-K కోసం ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నాము.. దర్శకుడు నాగ్ అశ్విన్!

Director Nag Ashwin said they are Building a new world for Project-K

Project K : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ప్రాజెక్ట్-K’. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజుకో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా ఇంటరాక్షన్ లో ఒక అభిమానికి వెల్లడించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Project K: ప్రాజెక్ట్-K విషయంలో అవన్నీ రూమర్లేనంటూ తేల్చేసిన నాగ్ అశ్విన్

ఇక విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం దర్శకుడు ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నాడట. “సినిమా స్క్రిప్ట్ కొత్తది అవ్వడంతో, అసలు ముందు ఈ మూవీ ఎలా తీయాలి అనేదానికి చాలా సమయం పడుతుంది. ‘మహానటి’ సినిమా విషయంలో.. ఆ కాలంలో ఉపయోగించిన కార్లు చూపించడానికి రెంట్ కి తీసుకువచ్చాము. కానీ ఈ సినిమా సంగతికి వస్తే, మేమే కార్లు తయారు చేసుకోవాల్సి వస్తుంది.

వరల్డ్ లోని టాప్ టెక్నిషన్స్ అంతా ప్రాజెక్ట్-K ప్రపంచాన్ని నిర్మించడానికి చాలా కష్టపడుతున్నారు. సినిమా అయితే కొత్తగా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇది మర్వెల్ సూపర్ హీరో తరహాలో ఉండబోతుంది అంటూ నెటిజెన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోణె ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.