Adipurush : ప్రభాస్ పేరు రాముడు కాదు.. ‘ఆదిపురుష్’పై ఓంరౌత్ వ్యాఖ్యలు..

తాజాగా 'ఆదిపురుష్' డైరెక్టర్ ఓంరౌత్ ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్ గురించి ఆసక్తికర విషయాలని తెలియచేశారు. ఆదిపురుష్ సినిమా గురించి ఓం రౌత్ మాట్లాడుతూ.............

Adipurush : ప్రభాస్ పేరు రాముడు కాదు.. ‘ఆదిపురుష్’పై ఓంరౌత్ వ్యాఖ్యలు..

Adipurush

Adipurush :   ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అయిపొయింది. రామాయణాన్ని ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.

తాజాగా ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓంరౌత్ ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్ గురించి ఆసక్తికర విషయాలని తెలియచేశారు. ఆదిపురుష్ సినిమా గురించి ఓం రౌత్ మాట్లాడుతూ.. ” ఆదిపురుష్ స్క్రిప్ట్ ని ఎప్పుడో ఒక కథగా రాసుకున్నాను. కానీ లాక్ డౌన్ లో కేవలం 45 రోజుల్లో ఆదిపురుష్ స్క్రిప్ట్ ని పూర్తి చేశాను. ఈ సినిమా రాసుకున్నప్పటి నుంచి నా మైండ్ లో ఉంది ప్రభాస్ ఒక్కడే. ప్రభాస్ అయితేనే ఈ పాత్రని మోయగలడని అనిపించింది. కేవలం మూడు సన్నివేశాలు విని ప్రభాస్ ఈ సినిమాని ఓకే చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కి వెళ్లి ప్రభాస్ కి పూర్తి కథ వినిపించాను” అని తెలిపారు.

Adipurush Work

”దాదాపు ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లతో తెరకెక్కుతుంది. భారత సినిమాలలో అత్యంత ఖరీదైన సినిమాల్లో ఇది ఒకటి. అత్యాధునికమైన సాంకేతిక విలువలతో ‘ఆదిపురుష్’ని తెరకెక్కిస్తున్నాం. టెక్నికల్ గా దీనికి చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది.”

Vijayawada : దుర్గమ్మ సన్నిధిలో సాయిధరమ్ తేజ్.. యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి బయటకు..

”వాల్మీకి రాసిన రామాయణంలో అయోధ్య రాజు రాముడు, రావణాసురుడు సీతను అపహరించి తీసుకువెళ్తే ఆమెని రక్షించడానికి లంకకు వెళతాడు. రామాయణంలో ఉన్న అన్ని మెయిన్ పాయింట్లను ‘ఆదిపురుష్’లో చూపిస్తాము. “ఆదిపురుష్” షూటింగ్ కోసం 7000 సంవత్సరాల క్రితం సెట్ వేసాం. రామాయణ కథని ఆధునిక కథా పద్ధతులతో చెప్పాను. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు రాముడు కాదు. రాముడికి మరో పేరు రాఘవ. అందుకే ఇందులో రాఘవుడు అని పేరు వాడాం. కృతి సనన్ పోషించిన సీత క్యారెక్టర్ జానకి పేరుతో పిలుస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ రావణుడు క్యారెక్టర్ కి లంకేష్ అని పెట్టాం. ఈ పేర్లన్నీ కూడా “రామాయణం” నుంచి తీసుకున్నవే. ఆదిపురుష్ అంటే “మొదటి మనిషి” అని అర్ధం అయితే మేము “ఉత్తమ పురుషుడు” అనే అర్ధంతో తీసుకున్నాం” అని ఆదిపురుష్ గురించి తెలిపారు.

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ చదివిస్తా అన్నారు : పవన్ కారవాన్ అసిస్టెంట్

“ఆదిపురుష్” సినిమా 2022 చివర్లో రిలీజ్ అవుతుందని, పాన్ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవ్వనుంది తెలిపారు డైరెక్టర్ ఓంరౌత్.