Sarkaru Vaari Paata: పరశురామ్ సవాల్.. చొక్కాలు చింపుకొనే రేంజ్ అట!

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ సాలిడ్ ప్రాజెక్ట్ సర్కారు వారి పాట మళ్ళీ ఎట్టకేలకు షురూ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటి. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ఎంటర్టైనర్ కొత్త షెడ్యూల్ సోమవారం నుండే ప్రారంభం అయ్యింది.

Sarkaru Vaari Paata: పరశురామ్ సవాల్.. చొక్కాలు చింపుకొనే రేంజ్ అట!

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ సాలిడ్ ప్రాజెక్ట్ సర్కారు వారి పాట మళ్ళీ ఎట్టకేలకు షురూ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటి. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ఎంటర్టైనర్ కొత్త షెడ్యూల్ సోమవారం నుండే ప్రారంభం అయ్యింది. మొత్తం యూనిట్ కి మళ్ళీ కరోనా పరీక్షలు నిర్వహించి మరీ సూపర్ ఎనర్జీతో మేకర్స్ ఈ కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేసేశారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా మహేష్ బాబు సరికొత్త లుక్ తో కనిపిస్తుండడంతో అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా కథ ఏంటి.. మహేష్ మాస్ లుక్.. విడుదలైన పోస్టర్స్ ఇలా ప్రతిదీ అభిమానులలో ఎప్పటికప్పుడు చర్చే జరుగుతుంది.ఇక సినిమాపై ఇటీవల దర్శకుడు పరశురామ్ మరో క్లారిటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ఫ్యాన్స్ చొక్కాలు చినిగిపోయేలా ఉంటుందని కామెంట్ చేశారు.

రజనీకాంత్ సర్ ఫ్యాన్స్ ఎలా అయితే చొక్కాలు చించుకున్నారో.. సర్కారు వారి పాటకు కూడా ఫ్యాన్స్ అలానే చించుకుంటారు. ఫ్యాన్స్ స్టఫ్ కు ఒక మెస్సేజ్ తోడైతే ఎలా ఉంటుందో మీరు చూస్తారు.. అంటూ దర్శకుడు పరుశురాం చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. పరుశురాం ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ అభిమానులు ఇప్పటి నుండే ఊహల్లో తేలిపోతున్నారు. మరి సినిమా ఆ రేంజ్ అందుకుంటే మాత్రం ఇక ఆపడం ఎవరి తరం కాదేమో మరి!