అయోధ్యలో భూమి పూజకి.. ‘‘ఆదిపురుష్’’కి లింకేంటి?

  • Published By: sekhar ,Published On : August 23, 2020 / 01:46 PM IST
అయోధ్యలో భూమి పూజకి.. ‘‘ఆదిపురుష్’’కి లింకేంటి?

Rajamouli about Adipurush: ‘బాహుబలి’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టులు అంగీకరిస్తున్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్.. రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే పోస్టర్ రిలీజ్ చేశారు.

తాజాగా ఈ సినిమాపై దర్శకధీరుడు రాజమౌళి స్పందించారు. ‘‘ఆదిపురుష్’ పోస్టర్‌ నేనెప్పుడో చూసేశాను. అద్భుతంగా ఉంది. ఈ సినిమా రావడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే అయోధ్యలో ఇటీవలే భూమి పూజ జరిగింది. దేశమంతా రాముడి గురించి చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో రాముడి మీద సినిమా వస్తే చాలా బాగుంటుంది. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ మరింత పెరుగుతుంది’’ అని రాజమౌళి అన్నారు.

హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ‘ఆదిపురుష్’ ఈ చిత్రాన్ని తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేయనున్నారు. 2021లో షూటింగ్ ప్రారంభించి 2022లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.