RRR: ఈసారి ప్రమోషన్ సాంగ్ విడుదల ప్రయత్నాల్లో రాజమౌళి?

ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు యావత్ ఇండియన్ సినీ లోకం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు నటీనటులను రప్పించిన రాజమౌళి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తెస్తాడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు.

RRR: ఈసారి ప్రమోషన్ సాంగ్ విడుదల ప్రయత్నాల్లో రాజమౌళి?

Rrr

RRR: ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు యావత్ ఇండియన్ సినీ లోకం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు నటీనటులను రప్పించిన రాజమౌళి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తెస్తాడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు. అలా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ అభిమానులకు ఈ మధ్యనే ఓ కానుక అందించిన సంగతి తెలిసిందే.

జులై 15 ఉదయం 11గంటలకు ఈ మల్టీస్టారర్ మూవీ మేకింగ్‌ వీడియో విడుదల చేయగా ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు ఇది పండగలా కనిపించింది. ఈ వీడియోలో రాజమౌళితో పాటు టెక్నిషియన్ల కష్టం స్పష్టంగా తెలిసింది. అసలే భారీ అంచనాలు కాస్త ఈ వీడియోతో మరికాస్త పెరిగి ఇప్పుడు తర్వాత ఆర్ఆర్ఆర్ నుండి అప్డేట్ ఇప్పుడా అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే.. త్వరలోనే ఏకంగా మేకింగ్ ప్రమోషన్ పాటను తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.

సహజంగా సినిమాకు కొన్ని నెలల ముందే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టే జక్కన్న ఓ పక్క సినిమాకి ఫైనల్ టచ్ షూటింగ్, అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటూనే ఇప్పటికే ప్రమోషన్స్ కి సెపరేట్ టీమ్ ని పెట్టేసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో ప్రమోషనల్ వీడియో సాంగ్ కు ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తుంది. ఇందుకోసమే గత కొద్దినెలలుగా బంధించిన షూటింగ్ వీడియోలపై కుస్తీ పడుతున్నారట. విడుదలైన వీడియోకే ఇండస్ట్రీ దద్దరిల్లాగా మరి ఇక ఈ ప్రమోషన్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.