RRR: హనుమంతుడిలా రామ్ చరణ్.. శ్రీరాముడిలా ఎన్టీఆర్!

సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా మార్చి 25న థియేటర్లలలో విడుదల..

RRR: హనుమంతుడిలా రామ్ చరణ్.. శ్రీరాముడిలా ఎన్టీఆర్!

Rrr

RRR: సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా మార్చి 25న థియేటర్లలలో విడుదల కానుంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తుండగా.. ఇందుకోసం చిత్ర బృందం ప్రమోషన్స్ భారీగా నిర్వహిస్తుంది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా శనివారం కర్ణాటకలోని చిక్బల్లాపూర్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకి ఆర్ఆర్ఆర్ టీమ్ తో పాటు కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖులు కూడా హాజరవగా ఈ వేడుకకి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

RRR: చిరంజీవి గారు.. యుఆర్ఏ ట్రూ మెగాస్టార్.. రాజమౌళి కామెంట్స్!

ఈ వేడుకలో నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. ‘ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా వచ్చినా ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రులకు ధన్యవాదాలు. శివ రాజ్ కుమార్‌కి థ్యాంక్స్. నందమూరి అభిమానులు, మెగా అభిమానులకు థ్యాంక్స్. బయట ఉన్న వాళ్లకు సారీ. ఇంత పెద్ద ఈవెంట్‌ను నిర్వహించిందుకు కేవీఎన్ గారికి థ్యాంక్స్. రాజమౌళి గారికి థ్యాంక్స్. ఇద్దరు పవర్ ఫుల్ హీరోలతో సినిమా తీసి నన్ను ఈ సినిమాకు నిర్మాతగా చేసినందుకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను. ఎంతో మాట్లాడదామని వచ్చాను.

RRR: బంగాళాఖాతం హోరులా మెగా ఫ్యాన్స్.. అరేబియా ఘోషలా నందమూరి ఫ్యాన్స్!

మిమ్మల్ని అంతా చూసి మాట్లాడలేకపోతోన్నాను. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. నాకు తోడుగా ఉండి సహకరించిన కార్తికేయ, వల్లి మేడం, రమా గారికి థ్యాంక్స్. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చిన ఏపీ గవర్నమెంట్, సీఎం జగన్, పేర్ని నాని గారికి థ్యాంక్స్. తెలంగాణ సీఎం కేసీఆర్, తలసాని గారికి థ్యాంక్స్. ముఖ్యంగా చెప్పాల్సింది చిరంజీవి గారి గురించి. ఇండస్ట్రీ తరుపున కృషి చేశారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని అన్నారు.

RRR: టికెట్ల ధర పెంపు.. తెలుగు రాష్ట్రాల సీఎంలకు దానయ్య కృతజ్ఞతలు

రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఈ రోజుఇక్కడ సంగమ కనిపిస్తోంది. తెలుగు, కన్నడ సంగమం. మెగా, నందమూరి అభిమానుల సంగమం కనిపిస్తోంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇలానే ఉండేదా? అని అనిపిస్తోంది.. ఫ్యామిలీ మెంబర్లైనా అసిస్టెంట్ డైరెక్టర్లు గురించి ఈ రోజు చెప్పాలని అనుకుంటున్నాను..

RRR: ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాట్ టాపిక్‌గా మారిన జెండాలు!

కో డైరెక్టర్ కోటి.. నా అసోసియేట్ డైరెక్టర్.. ఆయన కింద పని చేశాను.. కథ చర్చల్లో తప్పు చేస్తే.. ధైర్యంగా చెప్పి నన్ను కరెక్ట్ చేస్తాడు.. శ్రీను.. శాంతి నివాసం సీరియల్ నుంచి నాతోనే ఉన్నాడు. వాచ్ డాగ్‌లా కాపాడుతుంటూ వస్తాడు.. శ్రీరామ్ మెరుపు తీగలా పని చేస్తాడు.. సాబు సర్‌కి కూడా రైట్ హ్యండ్.. కిరణ్ అండ్ అనిల్.. మా బాస్ మమ్మల్ని చూస్తున్నాడా? లేదా? అని చూడకుండా.. వెనకుండి నడిపిస్తుంటారు.. నాగార్జున ఆన్ లైన్ ఎడిటర్.. రాహుల్ అన్ని భాషల నటీనటులను కోఆర్డినేట్ చేశాడు.. లీగర్ అగ్రిమెంట్ సెల్ కూడా పెట్టేస్తాడు.. సురేష్ డబ్బింగ్ అంతా చూసుకున్నాడు.. ఐదు భాషల్లో డబ్బింగ్ చెబితే తప్పులేకుండా చూసుకున్నాడు.. షెడ్యూల్ సుధాకర్, సుబ్బు.. ఆ పదిమందే నా బలం..

RRR: 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్.. ఫస్ట్ డే రూ.150 కోట్ల టార్గెట్!

వారు లేకపోతే ఇంత దూరం వచ్చేవాడిని కాదు.. మా అసిస్టెంట్ డైరెక్టర్లు నటించి ఆర్ఆర్ఆర్ సినిమా చూపిస్తాం.. కచ్చితంగా నవ్వుతారు.. సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్.. యోగానంద్.. ఇంగ్లీష్ రాకపోయినా బల్గేరియాలో మానేజ్ చేశారు.. ఈ సినిమా విజువల్ ట్రీట్ అంటున్నారు.. సాబు సిరిల్, సెంథిల్, సూపర్ వైజర్ శ్రీనివాస్, రమా గారు ఉంటేనే విజువల్స్ బాగుంటాయి..

RRR: చిరంజీవి గారు.. యుఆర్ఏ ట్రూ మెగాస్టార్.. రాజమౌళి కామెంట్స్!

తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారికి మా సినిమా గురించి చెప్పిన వెంటనే.. రేట్లు పెంచుకునేందుకు అంగీకరించారు. తెలుగు సినిమా ప్రైడ్ అని రేట్లు పెంచుకునేందుకు ఓకే చెప్పేశారు. ఈ జీవో విషయంలో సహకరించిన సంతోష్, తలసాని గారికి థ్యాంక్స్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి థ్యాంక్స్. సినిమా రేట్లు పెంచారు. సినిమా అనేది పేదవారికి మరీ దూరం కాకుండా రేట్లు పెంచిన జగన్ గానికి, పేర్ని నాని, కొడాలి నానికి థ్యాంక్స్.

RRR: తెలంగాణలో ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్లు ఇవే!

జీవో వచ్చినప్పుడు బాగా లేదని అనిపించింది. మేం ముందుకు వెళ్దామని, మాట్లాడుదామని అనుకున్నాం. కానీ ముందుకు వెళ్లలేదు. కానీ ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. సీఎం గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఈ కొత్త జీవో కోసం ప్రయత్నించారు. రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన్న చాలా మంది చాలా అన్నారు.. మమ్మల్ని నెగ్గించేందుకు ఆయన తగ్గారు. ఆయన మాటలు పడ్డారు. తెలంగాణ జీవో రావడానికి కూడా ఆయనే కారణం. తెర వెనుక ఉండి నడిపించారు.. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం ఆయనకు ఇష్టం ఉండదు. ఇండస్ట్రీ బిడ్డగానే చూడాలని అంటారు. కానీ నేను మాత్రం ఆయన్ను పెద్దే అంటాను. అలానే గౌరవిస్తాను.

RRR: సెంచరీ కొట్టిన ఆర్ఆర్ఆర్.. ఆలస్యమైనా తగ్గని క్రేజ్!

నా రాముడు, నా భీముడు. నేను అడిగిన వెంటనే.. ఏం తీస్తున్నారు.. ఏం చేస్తున్నారు అని ఏం అడగలేదు. శరీరంలో ఉన్న ప్రతీ అణువుని నా సినిమా కోసం పెట్టారు. వారికి థ్యాంక్స్ చాలా చిన్న పదం అవుతుంది.. రామ్ చరణ్ తేజ్ అని చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలియదు.. రామ్ చరణ్ తేజ్ అంటే ఆంజనేయుడు. హన్మంతుడికి తన బలం ఏంటో తనకు తెలియదు.. అలానే రామ్ చరణ్‌కి కూడా ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో తెలీదు.. తనకోసం ఎలా చచ్చిపోతారో తెలీదు.. మనం చెప్పాలి.. ఆంజనేయుడికి తన బలం ఏంటో చెబితే.. సముద్రాన్ని దాటేశాడు. అలాంటి ఆంజనేయుడు నా బ్రదర్..

RRR: ఆర్ఆర్ఆర్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇదేనా..?

నందమూరి హరికృష్ణ గారు తారక రామారావు అని ఎందుకు పేరు పెట్టారో గానీ.. సేమ్ రాముడిలెక్క.. రాముడు పితృవ్యాఖ్యపరిపాలకుడు.. ఏక పత్నివ్రతుడు.. ఓన్లీ ప్రణతి.. ఇంకేం లేదు.. స్ట్రెంత్ ఏంటో తెలిసిన మహనీయుడు రాముడు.. తన స్ట్రెంతో ఏంటో తెలిసిన నటుడు ఎన్టీఆర్.. ఎలా చేయగలడో.. ఎంతలా మెప్పించగలడో.. తెలుసు.. అలాంటి నా భీముడు.. రామ్ చరణ్ గొప్ప నటుడు.. అది అతనికి తెలియదు.. ఎన్టీఆర్ గొప్ప నటుడు.. అది అతనికి తెలుసు.. ఈ ఇద్దరూ గొప్ప నటులు నా సినిమాలో ఉన్నారు.. నేను సూపర్ హ్యాపీ.. టాప్ ఆఫ్ ది వరల్డ్‌లో ఉన్నట్టుంది’ అంటూ స్పీచుతో దుమ్ములేపేశాడు.

RRR: రీ ప్రమోషన్స్ జోరు.. అంచనాలు పెంచేస్తున్న ఆర్ఆర్ఆర్ టీమ్

రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘మా కుటుంబ సభ్యుడు.. మా బిగ్ బ్రదర్.. పునీత్ రాజ్ కుమార్ గారు మన మధ్య లేడంటే నమ్మాలని లేదు. నమ్మను కూడా. ఆయన ఇక్కడే ఉంటూ మనల్ని ఆశీర్వదిస్తుంటాడు. ఆయన లేని లోటు శివన్న ద్వారా తీర్చుకుంటాం. మా కోసం ఇంత ఓర్పుగా ఎదురుచూస్తున్నా తారక్ అభిమానులు, మెగా అభిమానులకు పేరుపేరునా థ్యాంక్స్. మీరంతా నీడలా మా వెంట ఉన్నారు. మార్చి 25న మా కష్టం, మా శ్రమను మీకు చూపించేందుకు వస్తున్నాం.

RRR: చరణ్ సైలెంట్.. టైమింగ్‌తో అటెన్షన్ కొట్టేస్తున్న తారక్!

ప్రస్తుతం ఇప్పుడు జీరో ఫీలింగ్స్ ఉన్నాయి. మీ అందరూ సినిమా చూడండి. కర్ణాటక పెద్ద మార్కెట్. ఏపీ, తెలంగాణ ఎంత పెద్ద మార్కెటో.. కర్ణాటక కూడా అంతే. ఈ సినిమాను ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్న కేవీఎన్ గారికి థ్యాంక్స్. దానయ్య గారికి, కీరవాణి గారికి థ్యాంక్స్. మీరు మ్యూజిక్ చేసిన సినిమాలో నేను నటించినందుకు ఆనందంగా ఉంది. రాజమౌళి టీం అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

RRR: రెండు భిన్న ధృవాలు.. చెలరేగిపోతున్న తారక్.. గుంభనంగా చరణ్!

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. శివరాజ్ కుమార్ అన్నకి ధన్యవాదాలు. పునీత్ సర్ ఇక్కడ లేరు అనే మాటను ఎప్పుడూ నమ్మలేదు. పార్థివ దేహాన్ని చూడటానికి వచ్చినప్పుడు నాకు అనిపించింది.. ఈ గాల్లో, నేలలో, మట్టిలో ఆయన ఉన్నట్టు అనిపించింది. అందుకే ఈ రోజు చల్లని చిరుజల్లులతో మనల్ని పలకరించారు. పునీత్ సర్ మనతో లేడని నేను ఎప్పుడూ ఏడ్వలేదు. పునీత్ సర్ అంటే సెలెబ్రేషన్స్. ఆయన్ను ఎప్పుడూ సెలెబ్రేట్ చేస్తూనే ఉందాం. ఆయన లేరు అని ఎప్పుడూ ఏడ్వొద్దు.

RRR: ఎన్టీఆర్-చరణ్ పట్టిన జెండా కథ ఏంటో తెలుసా..?

నేను కన్నడలో మాట్లాడితే వినాలని మా అమ్మ కోరిక. రాజ్ కుమార్‌గారిని చూడాలని కలగనేది. కానీ ఆ భాగ్యం నాకు దక్కింది. ఆర్ఆర్ఆర్ కేవలం సినిమా కాదు. ఇది మా బంధం. రామ్ చరణ్ అభిమానులందరూ కలిసి ఇక్కడకు వచ్చారు అదే బంధం. ఇది కేవలం సినిమా కాదు. ప్రాంతీయ చిత్రాల హద్దులను చెరిపేసి.. భారతీ సినిమాగా చేయాలని కలగనే దర్శకుడు. ఈ చిత్రంలో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చినందుకు థ్యాంక్స్. మీరు కట్టబోయే రామసేతులో నాకు ఉడతలాంటి సాయం చేసే అవకాశం ఇచ్చినందుకు రాజమౌళికి థ్యాంక్స్.

RRR NTR Bike: తారక్ వాడిన బైక్ కథేంటి? దాని ప్రత్యేకతలేంటి?

ఈ చిత్రంలో ఎంతో మంది సాంకేతిక నిపుణులున్నారు. సెంథిల్, సాబు సిరిల్, శ్రీనివాస్ మోహన్, క్యాస్టూమ్.. తల్లి స్థానంలో కూర్చుని ఓ రూపాన్ని కల్పించిన రమా రాజమౌళి. మా తల్లి తరువాతి స్థానంలో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన వల్లి గారికి, తన సంగీతంతో అందరినీ ఈ సినిమా వైపుకు తిప్పుకున్న కీరవాణి, నటించిన నటీనటులకు థ్యాంక్స్ అన్నారు.