Sai Rajesh : పవన్ కి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకండి.. పవన్ అభిమానులకు డైరెక్టర్ లేఖ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కి చాలామంది అభిమానులు ఉన్నారు. పవన్ సభ పెడితే లక్షల్లో అభిమానులు వస్తారు. పవన్ ని ఎవరన్నా ఏమన్నా అంటే పవన్ అభిమానులు విమర్శలు చేస్తారు. అయితే పవన్ కళ్యాణ్ కి....................

Sai Rajesh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కి చాలామంది అభిమానులు ఉన్నారు. పవన్ సభ పెడితే లక్షల్లో అభిమానులు వస్తారు. పవన్ ని ఎవరన్నా ఏమన్నా అంటే పవన్ అభిమానులు విమర్శలు చేస్తారు. అయితే పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఎంత ప్లస్సో అంతే మైనస్. కొన్ని కొన్ని సార్లు పవన్ అభిమానులు చేసే పనులు పక్క వాళ్లకి ఇబ్బంది కలిగిస్తుంటాయి. చాలా మంది ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. పవన్ అభిమానులు ఒక్కోసారి పవన్ మాట కూడా వినరని అన్నారు.
అయితే పవన్ ఫ్యాన్స్ చేసే కొన్ని విమర్శల వల్ల, పవన్ అభిమానులు చేసే పనుల వల్ల పవన్ కళ్యాణ్ కి, జనసేనకు చెడ్డపేరు వస్తుంది. పవన్ అభిమానులు కూడా కొంతమంది జనసేనకు ఓట్లు వేయరు. ఇక వేరే వాళ్ళు ఇంకెక్కడా వేస్తారు. అభిమానుల్లో కాకుండా బయట ప్రజల దగ్గర పవన్ మంచి పేరు తెచ్చుకుందామని చూసినప్పుడల్లా పవన్ అభిమానులు చేసే పనులకి వ్యతిరేకత వస్తుంది. ఇక సోషల్ మీడియాలో అయితే పవన్ అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పవన్ అందరు హీరోలని ఒకేలా చూస్తారు, అందరితో బాగానే ఉంటాడు. కానీ అభిమానులు మాత్రం ఫ్యాన్ వార్స్ చేస్తూ ఉంటారు. దీంతో కొంతమంది యువతలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల వల్ల పవన్ పై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది.
ఇటీవల ఓ సినిమాకి సంబంధించి పవన్ అభిమానులు సోషల్ మీడియాలో వేరే ఫ్యాన్స్ తో ఫ్యాన్ వార్ సృష్టించి రచ్చ చేశారు. దీంతో మరోసారి పవన్ సోషల్ మీడియాలో ట్రెండ్ లో ఉన్నారు. తాజాగా దీనిపై స్పందిస్తూ నిర్మాత/ దర్శకుడు సాయి రాజేష్ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. గత సంవత్సర కాలంగా నాగబాబుగారి ద్వారా అయితే కానీ, కళ్యాణ్‌గారికి అత్యంత సన్నిహితులుగా మెలిగే వ్యక్తులతో కానీ, వారి ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే.. క్షణం తీరిక లేకుండా ప్రజా సేవ కార్యక్రమాలు చేస్తూ కూడా కళ్యాణ్‌గారు ఇన్ని సినిమాలు చేయటానికి కారణం జనసేన ఆర్థికంగా బలంగా లేకపోవటమే. ఓటు బ్యాంకు రాజకీయాలు క్రేజ్ మీద నడవవు. సినిమా పరిశ్రమలో ఉంటూ ఓ సైడ్ తీసుకోకూడదనుకునే నాలాంటి వాళ్లమే ఆయన కష్టం చూసి జల్సా స్పెషల్ షోస్ వంటివి మా వంతుగా చేశాం. ఆయనకి, పార్టీకి మీరు మంచి చేయకపోయినా పర్లేదు. హాని చేయకండి. సినిమాలు మాత్రమే చూసుకుని ఉండండి. కానీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత, ఒక మాట పడాల్సి వచ్చినప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితిలో మీరున్నారు. ఫ్యాన్ వార్‌లో తాత్కాలిక గెలుపు కోసం ప్రయత్నిస్తే, చాలా మంది మనుషుల్లో కళ్యాణ్‌గారి పట్ల, పార్టీ పట్ల శాశ్వతమైన శత్రుత్వం కలిగిస్తున్నారు. మేం ఆయన సినిమాలకు మాత్రమే అభిమానులం అనుకునే వారికి కాదు ఈ పోస్ట్. మా హీరో, ఆయన పార్టీ బాగుండాలని కోరుకునే నాకు తెలిసిన అతి కొద్ది మంది సెన్సిబుల్ అభిమానులకి ఈ రిక్వెస్ట్. ఇక ఆపేయండి. ఫుల్ స్టాప్ పెట్టేయండి. లేదా మీరు మాత్రం గొడవలకు దూరంగా ఉండండి. ఇక్కడ ఎవరూ తగ్గేది లేదు, పెరిగేది లేదు అంటూ లేఖ రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
NTR : ఫ్యాన్స్ ధాటికి తట్టుకోలేకపోతున్న హీరోలు.. అందుకే ఎన్టీఆర్ సీరియస్ అయ్యాడా?
దీంతో సాయి రాజేష్ పోస్ట్ చేసిన ఈ లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై పవన్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొంతమంది సాయి రాజేష్ ని సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది మా హీరోని ఏమన్నా అంటే తగ్గేదెలా అంటూ మళ్ళీ గొడవలకు సిద్ధమవుతున్నారు.
A request to few sensible @PawanKalyan fans from my side …
Pls translate it to tenglish for wider reach… pic.twitter.com/TXPhLaoLNm— Sai Rajesh (@sairazesh) February 5, 2023