Raviteja: మాస్ రాజాతో మరోసారి రచ్చ చేసేందుకు రెడీ అంటోన్న డైరెక్టర్..?

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తన తాజా చిత్రం ‘ధమాకా’ను రిలీజ్‌కు రెడీ చేస్తోన్న ఈ స్టార్ హీరో.. టైగర్ నాగేశ్వర్ రావు, రావణాసుర వంటి సినిమాలను లైన్‌లో పెట్టాడు. గతంలో రవితేజతో ఓ సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సంపత్ నంది, ఇప్పుడు మరోసారి ఆయనతో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నాడట.

Raviteja: మాస్ రాజాతో మరోసారి రచ్చ చేసేందుకు రెడీ అంటోన్న డైరెక్టర్..?

Director Sampath Nandi To Team Up Once Again With Raviteja

Raviteja: మాస్ రాజా రవితేజ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తన తాజా చిత్రం ‘ధమాకా’ను రిలీజ్‌కు రెడీ చేస్తోన్న ఈ స్టార్ హీరో.. టైగర్ నాగేశ్వర్ రావు, రావణాసుర వంటి సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రవితేజ, మరో సినిమా ‘వాల్తేరు వీరయ్య’లోనూ నటిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రవితేజ కనిపిస్తాడు.

Raviteja : డ్యాన్స్ షో ఫైనల్ ఎపిసోడ్ కి మాస్ మహారాజ్.. అదిరిపోయిన ఎంట్రీ..

అయితే గతంలో రవితేజతో ఓ సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సంపత్ నంది, ఇప్పుడు మరోసారి ఆయనతో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నాడట. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బెంగాల్ టైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కాగా, ఇప్పుడు మరోసారి రవితేజ కోసం సంపత్ నంది ఓ సాలిడ్ కథను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, సంపత్ నంది మరో హీరో గోపీచంద్ కోసం ఓ కథను రాసుకున్నాడని.. కానీ, ఈ కథకు రవితేజ అయితేనే పర్ఫెక్ట్‌గా ఉంటుందని ఆయన భావిస్తున్నాడట. అందుకే ఈ కథను రవితేజకు వినిపించేందుకు సిద్ధమవుతున్నాడట.

Raviteja: మళ్లీ ఇద్దరు బ్యూటీలతో మాస్ రాజా రొమాన్స్.. ఈసారి ఎవరంటే?

ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి మాస్ రాజా రవితేజతో ఓ సినిమా చేసేందుకు ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో సంపత్ నంది డైరెక్షన్‌లో రాబోయే ఈ సినిమాను ఆయనే ప్రొడ్యూస్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. నిజంగానే సంపత్ నంది, రవితేజ కాంబినేషన్ మరోసారి సెట్ అవుతుందో లేదో చూడాలి.