Sekhar Kammula : సినిమా నో డౌట్.. రానా హీరోగా ‘లీడర్’ సీక్వెల్..

‘లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. రానా దగ్గుబాటితో ‘లీడర్’ మూవీ సీక్వెల్ చేస్తానని కన్ఫమ్ చేశారు..

10TV Telugu News

Sekhar Kammula: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య – బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘లవ్ స్టోరీ’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. సంస్థలు నిర్మించాయి.. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ ద్వారానే సినిమా హిట్ అని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు.

Kewal : ‘ఢీ’ కంటెస్టంట్ కేవల్ కన్నుమూత.. ఎమోషనల్ అయిన యశ్ మాస్టర్..

ఇక రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ అతిథులుగా రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. సెప్టెంబర్ 24 సినిమా భారీ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. కొద్ది రోజులుగా మూవీ టీం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

Prema Nagar : తాత సినిమాతో మనవడి మూవీకి లింక్ భలే కుదిరిందే..

డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ సినిమా గురించి, కథ, నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి వివరంగా మాట్లాడారు. ఇంటర్వూ చివర్లో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా చెప్పారు. ధనుష్‌తో చేస్తున్న సినిమాను తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ చెయ్యాలనుకుంటున్నట్లు చెప్పారు. అలాగే ‘లీడర్’ సినిమా సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని అన్నారు..

Chiranjeevi : సాయి పల్లవిని మెగాస్టార్ మామూలుగా ఏడిపించలేదుగా..!

ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను తీసిన ‘లీడర్’ సినిమా అప్పుడు అందరు మామూలుగానే చూశారు కానీ ఇప్పుడు దాని కోసం ఇంకా మాట్లాడుకుంటారు. అలానే నేను ప్రతీ సినిమాని సన్నివేశాన్ని ఇంతకు మించి ఎవరూ తియ్యలేరు అన్నట్టుగా చెయ్యాలని ప్రయత్నిస్తా. ఒక పదేళ్ల తర్వాత నా పిల్లలకి కూడా గర్వంగా సినిమా చూపించగలగాలి అనుకుంటా. ‘లీడర్’ సినిమా సీక్వెల్ ఖచ్చితంగా చేస్తా, కానీ ఇప్పుడు కాదు. అదే పాత్రలతో రానా ఖచ్చితంగా ఉంటాడు. ఆ పాత్రలతోనే నడిచే విధంగా సీక్వెల్ చేస్తాను.
నెక్స్ట్ ధనుష్‌తో చేస్తున్నా. తమిళ్, తెలుగు ముందు అనుకున్నాం ఇక ఎలాగో ఓటీటీతో అందరికీ మంచి రీచ్ వచ్చింది కాబట్టి హిందీలో కూడా ప్లాన్ చేస్తున్నాం. పైగా ధనుష్‌కి కూడా హిందీలో రీసెంట్‌గా మంచి మార్కెట్ వచ్చింది. నా ముందు సినిమాల్లా కాకుండా ఇది థ్రిల్లర్ టైప్‌లో ఉంటుంది, పైగా కథ కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. అందుకే మల్టీ లాంగ్వేజెస్ సినిమాలా ప్లాన్ చేసాం’’ అన్నారు..

Love Story Trailer : ‘చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం’.. చైతు బెస్ట్ పెర్ఫార్మెన్స్..

 

10TV Telugu News