Indian 2: తొలిగిన విబేధాలు.. మళ్ళీ సెట్స్ మీదకి భారతీయుడు?

విలక్షణ నటుడు కమల్ హాసన్ దక్షణాది లెజెడ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ సినిమా ఎంత విజయం సాధించిందో తెలిసిందే. పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పుడు వచ్చినా..

Indian 2: తొలిగిన విబేధాలు.. మళ్ళీ సెట్స్ మీదకి భారతీయుడు?

Indian 2

Indian 2: విలక్షణ నటుడు కమల్ హాసన్ దక్షణాది లెజెడ్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ సినిమా ఎంత విజయం సాధించిందో తెలిసిందే. పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పుడు వచ్చినా చూస్తూనే ఉండే ప్రేక్షకులు ఉన్నారు. అలాంటి సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ మ్యాటర్ లో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్, దర్శకుడు శంకర్ మధ్య సమన్వయం లోపించింది.

Kajol: బైక్ కవర్ కప్పుకొచ్చావా.. కాజోల్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

ఈ వివాదాలు కాస్త కోర్టుల వరకు వెళ్లాయి. ఇండియన్ 2 సినిమా పూర్తిచేయకుండా మరో సినిమాకు ఎలా వెళ్తారని లైకా ప్రొడక్షన్ సంస్థ శంకర్ మీద హైకోర్టుకెక్కింది. కోర్టు వెలుపల పరిష్కారానికి సూచించిన కోర్టు అందుకు సమయం ఇచ్చింది. మరి ఆ సినిమా ఏమైందో ఏమో కానీ శంకర్ మాత్రం ఈలోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా.. బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తో అపరిచితుడు రీమేక్ సినిమాలను మొదలు పెట్టాడు.

Raviteja 70: జెట్ స్పీడ్‌తో మాస్ రాజా.. 70వ సినిమాకి ముహూర్తం!

కాగా, ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ఏంటంటే ఇండియన్ 2 సినిమాపై గొడవలు ముగిసిపోయాయని చెప్తున్నారు. దర్శక, నిర్మాతలు ఒక అభిప్రాయానికి వచ్చారని తమిళ ఇండస్ట్రీ టాక్. అయితే.. ఈ సినిమా మళ్ళీ సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుందన్నది ప్రకటించలేదు. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి తీసుకెళ్లే పనిలో ఉన్నాడు. అయితే.. ఈలోగా ముందుగా ఇండియన్ 2 పూర్తి చేయనున్నాడని ప్రచారం మొదలైంది. సగానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకు విదేశీ టెక్నీషియన్లు పనిచేయనున్నారు.