భారతీయుడు-2 ప్రమాదంపై డైరెక్టర్ శంకర్ సంచలన వ్యాఖ్యలు

భారతీయుడు-2(indian 2) మూవీ షూటింగ్ లో జరిగిన ఘోర ప్రమాదం అందరిని షాక్ కి గురి చేసింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు భారీ క్రేన్ విరిగిపడింది.

  • Published By: veegamteam ,Published On : February 26, 2020 / 06:10 PM IST
భారతీయుడు-2 ప్రమాదంపై డైరెక్టర్ శంకర్ సంచలన వ్యాఖ్యలు

భారతీయుడు-2(indian 2) మూవీ షూటింగ్ లో జరిగిన ఘోర ప్రమాదం అందరిని షాక్ కి గురి చేసింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు భారీ క్రేన్ విరిగిపడింది.

భారతీయుడు-2(indian 2) మూవీ షూటింగ్ లో జరిగిన ఘోర ప్రమాదం అందరిని షాక్ కి గురి చేసింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు భారీ క్రేన్ విరిగిపడింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో హీరో కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్(director shankar) స్పాట్ లోనే ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. దీనిపై కమల్ హాసన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు స్నేహితులను కోల్పోయానని వాపోయారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున సాయం ప్రకటించారు.

నేను చనిపోయినా బాగుండేది:
ఫిబ్రవరి 19న రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి డైరెక్టర్ శంకర్ స్పందించలేదు. దీంతో శంకర్ ఎక్కడున్నారు? ఈ ప్రమాదంలో శంకర్ కూడా గాయపడ్డారా? అసలు.. ఆయనెందుకు స్పందించడం లేదు? అనే ప్రశ్నలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వాటికి ఇవాళ(ఫిబ్రవరి 26,2020) బదులిచ్చారు డైరెక్టర్ శంకర్.

ఇన్ని రోజుల తర్వాత దర్శకుడు శంకర్ స్పందించారు. తొలిసారి ఆ విషాద ఘటనపై ఆయన నోరు విప్పారు. ఎమోషనల్ పోస్టు పెట్టారు. ”ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పటికీ నా కళ్లలోనే ఉంది. ఆ రోజు నుంచి నిద్ర కూడా పట్టడం లేదు. కలలో కూడా ఊహించని దుర్ఘటన. నా అసిస్టెంట్ డైరెక్టర్, పర్సనల్ అసిస్టెంట్, ప్రొడక్షన్ అసిస్టెంట్ మరణం కలిచివేసింది. రెప్పపాటులో ఆ క్రేన్ నుంచి నేను తప్పించుకున్నా. ఆ రోజు ఆ క్రేన్ నాపై పడినా బాగుండేది, నేను చనిపోయినా బాగుండేది” అంటూ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు దర్శకుడు శంకర్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు శంకర్. 

షూటింగ్ లో జాగ్రత్తలు తీసుకోవాలి:
తీవ్ర భావోద్వేగంతో శంకర్ చేసిన పోస్టు పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు సానుభూతి తెలుపుతున్నారు. ‘‘మీ బాధను మేం అర్థం చేసుకోగలం సార్. కానీ, ఆ ప్రమాదం మీ చేతుల్లో లేదు కదా. మీరేం చేయగలరు. మీరు త్వరగా కోలుకోవాలి. మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాలి’’ అని కొంత మంది శంకర్‌ను ఓదార్చారు. ‘‘షూటింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి సార్’’ అంటూ మరికొందరు సలహాలు ఇస్తున్నారు. 

ముగ్గురు మృతి, 9మందికి గాయాలు:
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న మూవీ ‘ఇండియన్ 2’. భారతీయుడు(1996) సినిమాకు ఇది సీక్వెల్. చెన్నై శివారులోని ఈవీపీ ఫిలిం సిటీలో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో దురదృష్టవశాత్తు భారీ క్రేన్ కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ (35), ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్ (58), ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు (27) ఉన్నారు. మధు.. డైరెక్టర్ శంకర్ వ్యక్తిగత సహాయకుడు కూడా. కమల్‌‌, శంక‌ర్ కాంబోలో రూపొందుతోన్న ‘ఇండియ‌న్ 2’ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది.

క్రేన్ ప్రమాదం కోలీవుడ్ తో పాటు యావత్ సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ప్రతి ఒక్కరు తమ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్శకుడు శంకర్, హీరో కమల్ కి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసుని తమిళనాడు ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

Read More>>బాలీవుడ్ హీరోతో మహేష్ బాబు మల్టీ స్టారర్: చిరంజీవి సినిమా తర్వాతేనా?