Yash: యష్‌తో డైరెక్టర్ శంకర్ వెయ్యికోట్ల బడ్జెట్ మూవీ.. నిజమేనా?

భారతీయుడు2, RC15 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శంకర్.. ఈ సినిమాల తర్వాత యష్ తో ఓ భారీ సినిమాని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇంతటి భారీ చిత్రానికి ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఫస్ట్ టైమ్.. వెయ్యికోట్ల బడ్జెట్ తో పెట్టబోతున్నట్టు...

Yash: యష్‌తో డైరెక్టర్ శంకర్ వెయ్యికోట్ల బడ్జెట్ మూవీ.. నిజమేనా?

Director Shankar Yash Thousand Crores Movie

Yash: భారతీయుడు2, RC15 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శంకర్.. ఈ సినిమాల తర్వాత యష్ తో ఓ భారీ సినిమాని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. ‘కెజిఎఫ్’తోనే సూపర్ స్టార్ అయిపోయిన యష్..’కెజిఎఫ్-2’తో 1200కోట్లు కలెక్ట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా బ్లాక్ బస్టర్ కలెక్షన్లు సాధించాడు . ఇలా భారీ డైరెక్టర్, భారీ కలెక్షన్లు రాబట్టే స్టార్ హీరో యష్ కాంబినేషన్లో సినిమా ఇంకెంత భారీగా తెరకెక్కబోతోందో, ఇంకెంత గ్రాండ్ గా ఉంటుందో అని ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్ .

RC15 First Look: ఫస్ట్ లుక్ కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న శంకర్..?

శంకర్ కాంబినేషన్లో ఇది యష్ మాత్రమే హీరోగా చేస్తున్న సినిమా కాదు.. తమిళ్, కన్నడ, మళయాళ, తెలుగు స్టార్స్ తో కలిసి భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేతున్నాడట శంకర్. వలరి బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతుంది ఈ సినిమా. ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం కరణ్ జోహార్ తో పాటు స్టార్ ప్రొడ్యూసర్లందరూ కలవబోతున్నారని టాక్ నడుస్తోంది.

అయితే ఇంతటి భారీ చిత్రానికి ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఫస్ట్ టైమ్.. వెయ్యికోట్ల బడ్జెట్ తో పెట్టబోతున్నట్టు, సౌత్ లోని పలు సూపర్ స్టార్స్ తో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా తెరకెక్కబోతున్నట్టు గాసిప్ వినిపిస్తుంది. సాంకేతిక హంగులతో వైవిధ్యమైన కథలు తెరకెక్కించడంలో డైరెక్టర్ శంకర్ దిట్ట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజమున్నదో తెలియాలంటే వేచి చూడాలి.