Director Shankar: క్రికెటర్‌తో శంకర్ కూతురు పెళ్లి.. అతనెవరో తెలుసా?

త‌మిళ డైరెక్ట‌ర్ శంక‌ర్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. దక్షణాది సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన కొద్దిమంది దర్శకులలో శంకర్ ఒకరు. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు స్టార్ హీరోలంతా ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని కోరుకొనేంత గ్రేట్ దర్శకుడు. కాగా.. ఇప్పుడు ఆ దర్శకుడి ఇంట్లో పెళ్లి సంద‌డి నెల‌కొంది. త‌న పెద్ద కూతురు ఐశ్వ‌ర్య‌కు శంకర్ త్వ‌ర‌లోనే పెళ్లి చేయ‌బోతున్నాడు.

Director Shankar: క్రికెటర్‌తో శంకర్ కూతురు పెళ్లి.. అతనెవరో తెలుసా?

Director Shankar

Director Shankar: త‌మిళ డైరెక్ట‌ర్ శంక‌ర్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. దక్షణాది సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన కొద్దిమంది దర్శకులలో శంకర్ ఒకరు. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు స్టార్ హీరోలంతా ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని కోరుకొనేంత గ్రేట్ దర్శకుడు. కాగా.. ఇప్పుడు ఆ దర్శకుడి ఇంట్లో పెళ్లి సంద‌డి నెల‌కొంది. త‌న పెద్ద కూతురు ఐశ్వ‌ర్య‌కు శంకర్ పెళ్లి చేయ‌బోతున్నాడు. శంకర్ కూతురు ఐశ్వ‌ర్య ఒక డాక్ట‌ర్‌.. కాగా ఆమెకు కాబోయే భ‌ర్త ఒక క్రికెట‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం.

శంకర్ కు కాబోయే అల్లుడు గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు.. బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే అందరూ సెర్చ్ చేస్తున్నారు. త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో స్టార్ క్రికెట‌ర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ దామోద‌ర‌న్‌కు శంకర్ త‌న పెద్ద కూతురును ఇచ్చి పెళ్లి చేయ‌బోతున్నాడు. రోహిత్‌ తండ్రి దామోదరన్‌ తమిళనాడులో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కాగా మధురై పాంథర్స్ టీమ్‌కి స్పాన్సర్‌గా కూడా ఉన్నారట.

ఈ వివాహ వేడుక ఈ ఆదివారం(జూన్‌ 27)న జరగబోతుందని సమాచారం కాగా అందుకు పొల్లాచి వేదిక కాబోతుందని తెలుస్తుంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు అతికొద్ది మంది సన్నిహితులతోనే ఈ వివాహ వేడుకకి ప్లాన్‌ చేసినట్టు సమాచారం. వివాహానంతరం కోవిడ్ ఉదృతి తగ్గిన తర్వాత అన్ని జాగ్రత్తల నడుమ భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారట. కాగా, శంకర్ ప్రస్తుతం ఇండియన్-2 తెరకెక్కించనుండగా అది వివాదాలలో ఉంది. ఇక, రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా సినిమాతో పాటు అపరిచితుడు హిందీ రీమేక్ చేస్తున్నాడు.