Pawan Kalyan OG : అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సుజిత్.. OG Is Coming!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన సినిమా షూటింగ్ విషయంలో వేగం పెంచేశాడు. వినోదయ సిత్తం రీమేక్ షూటింగ్ పూర్తి చేసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) షూటింగ్ లో పాల్గొబోతున్న పవన్.. OG సినిమా అప్డేట్ కూడా ఇచ్చేశాడు.

Pawan Kalyan OG : అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సుజిత్.. OG Is Coming!

Director Sujith start searching locations for Pawan Kalyan OG

Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం తను సైన్ చేసిన సినిమాలు అన్నిటిని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే నిన్న (మార్చి 25) వినోదయ సిత్తం రీమేక్ మూవీ షూటింగ్ ని పూర్తి చేశాడు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) మెయిన్ లీడ్ లో నటిస్తుండగా.. పవన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ మూవీలో పవన్ టాకీ పార్ట్ పూర్తి అవ్వడంతో ఏప్రిల్ 5 నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) షూటింగ్ లో పాల్గొబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే, సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న OG మూవీ పనులు మొదలయ్యాయి.

Ustaad Bhagat Singh : ఉస్తాద్‌లో పవన్‌కి విలన్‌గా మంత్రి మల్లారెడ్డి.. బ్రతిమాలిన హరీష్ శంకర్!

డైరెక్టర్ సుజిత్ మూవీ లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్, ఎ ఎస్ ప్రకాష్ తో కలిసి లొకేషన్స్ వెతకడం మొదలు పెట్టాడు. OG మూవీ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి అని తెలియజేస్తూ.. లొకేషన్స్ లోని ఫోటోలను షేర్ చేశారు మేకర్స్. ఇక పంజా సినిమా తరువాత ఫ్యాన్స్ పవన్ ని మళ్ళీ అటువంటి క్యారెక్టర్ లో చూడలేదు. దీంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక RRR వంటి బ్లాక్ బస్టర్ తరువాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

PKSDT : వినోదయ సిత్తం షూటింగ్ పూర్తి చేసిన పవన్..

మరి ఈ సినిమాతో ఎన్ని రికార్డులు సృష్టిస్తారో చూడాలి. కాగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే మొదలు పెట్టిన హరి హర వీరమల్లు షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది అనే దాని పై ఎటువంటి సమాచారం లేదు. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పిరియాడికల్ డ్రామాగా రాబోతుంది. పవన్ కెరీర్ లోనే మొదటిసారి ఇటువంటి సబ్జెట్ చేయడం. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం.. పలుమార్లు షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వడంతో లేటు అవుతూ వచ్చింది.