Pushpa Thank You Meet : లైట్ అండ్ సెట్ బాయ్స్‌కి లక్ష రూపాయలు ప్రకటించిన సుకుమార్..

‘పుష్ప’ సినిమా కోసం కష్టపడిన కిందిస్థాయి టెక్నీషియన్స్‌కి (ప్రొడక్షన్, సెట్ అండ్ లైట్‌మెన్) ఒకొక్కరికి రూ. లక్ష ఇస్తున్నాని చెప్పి తన మంచి మనసు చాటుకున్నారు సుకుమార్..

Pushpa Thank You Meet : లైట్ అండ్ సెట్ బాయ్స్‌కి లక్ష రూపాయలు ప్రకటించిన సుకుమార్..

Sukku

Pushpa Thank You Meet: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది.

Pushpa : ‘పుష్ప’ పార్టీ ఇచ్చాడు..

ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 275 కోట్ల గ్రాస్ సాధించింది. హిందీతో పాటు కేరళలోనూ హయ్యెస్ట్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తమ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానులకు కృతజ్ఞతలు తెలియజెయ్యడానికి మంగళవారం హైదరాబాద్‌లో థ్యాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది టీం. ఈ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థ్యాంక్స్ తెలియజేశారు.

Pushpa : ప్రతీ సీన్ చక్కగా చెక్కావయ్యా సుకుమార్.. చిరు అభినందనలు..

‘ఆర్య’ సినిమా అప్పటి నుండి రంగ టీమ్ తన సినిమాలకు పనిచేస్తున్నారని.. మాకు అప్పుడప్పుడు నిద్ర ఉండదు కానీ వాళ్లు 24 గంటలు పని చేస్తూ అస్సలు నిద్రపోలేదు.. అంతసేపు శారీరక శ్రమ చేసి విశ్రాంతి లేకుండా ఉండడం అనేది అసాధ్యం అంటూ వారి కష్టాన్ని గుర్తు చేసుకున్న సుకుమార్.. తమ కోసం, తమ సినిమా కోసం అంతలా కష్టపడిన కిందిస్థాయి టెక్నీషియన్స్‌కి (ప్రొడక్షన్, సెట్ అండ్ లైట్‌మెన్) తిరిగి ఏదైనా ఇవ్వాలనుకున్నానని అందుకే ఒకొక్కరికి రూ. లక్ష ఇస్తున్నాని చెప్పి తన మంచి మనసు చాటుకున్నారు.