Director Teja : థియేటర్ వర్సెస్ పాప్‌కార్న్.. మళ్ళీ మాట్లాడిన తేజ.. నా థియేటర్లో పాప్‌కార్న్ రేటు అంతే..

డైరెక్టర్ తేజ ఇటీవల ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో థియేటర్స్ లో పాప్‌కార్న్ రేటు గురించి మాట్లాడారు. సినిమా పాప్‌కార్న్ రేట్ల వల్లే చనిపోతుంది, సినిమా టికెట్ కంటే పాప్‌కార్న్ రేటే ఎక్కువ ఉంటుందని పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి పాప్‌కార్న్ పై కామెంట్స్ చేశారు.

Director Teja : థియేటర్ వర్సెస్ పాప్‌కార్న్.. మళ్ళీ మాట్లాడిన తేజ.. నా థియేటర్లో పాప్‌కార్న్ రేటు అంతే..

Director Teja comments again on Popcorn and his own theater

Director Teja – Popcorn :  డైరెక్టర్ తేజ చాలా గ్యాప్ తర్వాత ‘అహింస’ (Ahimsa) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నిర్మాత సురేష్ బాబు తనయుడు, రానా (Rana) తమ్ముడు అభిరామ్ (Abhiram) ని హీరోగా పరిచయం చేస్తున్నారు ఈ సినిమాలో. గీతికా తివారి (Geethika Tiwary) హీరోయిన్ గా నటిస్తుండగా సదా (Sadha) ముఖ్య పాత్రలో నటిస్తోంది. అహింస సినిమా జూన్ 2న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

డైరెక్టర్ తేజ ఇటీవల ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో థియేటర్స్ లో పాప్‌కార్న్ రేటు గురించి మాట్లాడారు. సినిమా పాప్‌కార్న్ రేట్ల వల్లే చనిపోతుంది, సినిమా టికెట్ కంటే పాప్‌కార్న్ రేటే ఎక్కువ ఉంటుందని పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి పాప్‌కార్న్ పై కామెంట్స్ చేశారు. అయితే ఈ సారి తనకి ఓ థియేటర్ ఉందని, దాంట్లో ఉండే పాప్‌కార్న్ రేటు గురించి మాట్లాడారు.

NBK 108 : బాలయ్య అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఇదేనా? సోషల్ మీడియాలో వైరల్.. ఇంత మీనింగ్ ఉందా టైటిల్‌లో?

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ మాట్లాడుతూ.. స్టూడియో, థియేటర్ నాకు ఈ రెండూ గుడితో సమానం. ఈ గుడిలో సినిమా మొదలై, ఆ గుడిలో ప్రదర్శిస్తారు. ఈ మధ్యలోనే స్టార్లు తయారవుతారు, లాభాలు, నష్టాలూ అన్ని ఉంటాయి. ఈ రెండు గుళ్ళని కాపాడుకోవాలి. నేను దర్శకుడు, నిర్మాత మాత్రమే కాదు. ఎగ్జిబిటర్ కూడా. నాకు ఓ థియేటర్ ఉంది. కావాలనుకుంటే దాన్ని అమ్మేసి వచ్చిన డబ్బులు బ్యాంకులో వేసుకొని హాయిగా కూర్చోవచ్చు. కానీ నేను అలా చేయలేను. నష్టమొచ్చినా, లాభమొచ్చినా థియేటర్ నడిపిస్తాను. బయట థియేటర్స్ లో లాగా పాప్‌కార్న్ రేటు అంత ఉండదు.

నా థియేటర్లో పాప్‌కార్న్ మాత్రమే కాదు ఏదైనా 100 రూపాయల లోపే ఉంటుంది. సమోసాలు కూడా వేడివేడిగా ఉంటాయి. అన్ని ఫ్రెష్ గానే ఉంటాయి నా థియేటర్లో. ప్రేక్షకుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటేనే మళ్ళీ థియేటర్ కి వస్తాడు అని తెలిపారు. దీంతో పక్కనోళ్ళ పాప్‌కార్న్ రేట్ల మీద కామెంట్స్ చేయడం కాదు, తాను ఆచరించి చూపిస్తున్నాడని పలువురు డైరెక్టర్ తేజను అభినందిస్తున్నారు.