Mahesh Babu : నా హీరోల్లో మహేష్ బాబు బెస్ట్.. నేను అనుకున్న రియాక్షన్ కరెక్ట్‌గా ఇచ్చేవాడు.. తేజ!

రానా తమ్ముడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ తేజ తెరకెక్కిస్తున్న సినిమా అహింస. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో తేజ మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Mahesh Babu : నా హీరోల్లో మహేష్ బాబు బెస్ట్.. నేను అనుకున్న రియాక్షన్ కరెక్ట్‌గా ఇచ్చేవాడు.. తేజ!

Director Teja comments on Mahesh Babu at Ahimsa promotions

Teja – Mahesh Babu : మహేష్ బాబు, తేజ కలయికలో వచ్చిన సినిమా ‘నిజం’. ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్న మహేష్.. ‘జయం’ వంటి సూపర్ హిట్టుని అందుకున్న తేజ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గోపీచంద్ (Gopichand) ఈ సినిమాలో విలన్ గా నటించగా.. రక్షిత హీరోయిన్ గా, రాశి ఒక ముఖ్య పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. అయితే సినిమాలో నటించిన వారి నటనకి అయితే మంచి మార్కులే పడ్డాయి.

Akshay Kumar : అక్షయ్ కుమార్ రోబో బ్యాగ్.. వైరల్ అవుతున్న వీడియో!

ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో జీవించేశాడు అనే చెప్పాలి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ మహేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తేజ డైరెక్షన్ లో చేసిన అందరి హీరోల్లో మహేష్ బాబు బెస్ట్ అని చెబుతున్నాడు. మిగితా హీరోలంతా తేజ కావాల్సిన ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడానికి చాలా సమయం తీసుకుంటారు. కానీ మహేష్ బాబు మాత్రం.. ఆ సీన్ లో ఆ పాత్ర ఇవ్వాల్సిన ఎక్స్‌ప్రెషన్ ని కరెక్ట్ గా ఇచ్చేవాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Naatu Naatu : ‘నాటు నాటు’తో యుక్రెయిన్ నిరసన.. సైనికుల రీ క్రియేట్ వీడియో వైరల్!

కాగా తేజ ప్రస్తుతం అహింస (Ahimsa) సినిమాతో రాబోతున్నాడు. దగ్గుబాటి రానా (Rana Daggubati) తమ్ముడు అభిరామ్ (Abhiram) ని హీరోగా పరిచయం చేస్తూ తేజ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. జూన్ 2న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. మరి దర్శకుడిగా ఎంతో స్టార్స్ కి ఇండస్ట్రీలోకి రావడానికి ఒక దారి కలిపించిన తేజ.. అహింసతో అభిరామ్ కి ఎటువంటి రిజల్ట్ ని అందిస్తాడో చూడాలి.