Director Teja : రూ.10ల పాప్‌కార్న్ 400లకి అమ్ముతారా? మల్టిప్లెక్స్‌లు సినీ పరిశ్రమని నాశనం చేస్తున్నాయి..

తేజ మాట్లాడుతూ.. ''మల్టీప్లెక్స్ లు సినీ పరిశ్రమని నాశనం చేస్తున్నాయి. ప్రేక్షకులని దోపిడీ చేస్తున్నాయి. అన్ని మల్టీప్లెక్స్ వాళ్ళు ఒక ముఠాలాగా ఏర్పడి.................

Director Teja : రూ.10ల పాప్‌కార్న్ 400లకి అమ్ముతారా? మల్టిప్లెక్స్‌లు సినీ పరిశ్రమని నాశనం చేస్తున్నాయి..

Director Teja fires on Multiplex Theaters

Director Teja :  ఇటీవల థియేటర్ టికెట్ రేట్లు పెరిగి సినీ పరిశ్రమకి గట్టి దెబ్బే తగిలింది. టికెట్స్ రేట్లు తగ్గించాలని చాలామంది అభిప్రాయపడ్డారు. టికెట్ రేట్లు, అక్కడ తినుబండారాల రేట్ల వల్లే చాలా మంది థియేటర్స్ కి రావడం మానేశారు. ఇక మల్టీప్లెక్స్ లలో దోపిడీ గురించి చెప్పక్కర్లేదు. ఒకపక్క టికెట్ రేట్లు పెంచేసి మరో పక్క తినే పదార్థాలు కూడా భారీ రేట్లకి అమ్ముతున్నారు. దీనిపై ఎన్ని విమర్శలు వస్తున్నా మల్టీప్లెక్స్ లు మాత్రం తగ్గట్లేదు.

పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, సమోసాలు.. ఇలా మల్టీప్లెక్స్ లలో అమ్మే ప్రతి ఐటమ్ బయట కంటే దాదాపు 20 నుంచి 50 శాతం ఎక్కువ రేట్లు ఉంటున్నాయి. సాధారణ ప్రేక్షకులని మల్టీప్లెక్స్ లు నిలువు దోపిడీ చేసేస్తున్నాయి. దీనిపై సినీ పరిశ్రమ వాళ్ళు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా డైరెక్టర్ తేజ మల్టీప్లెక్స్ దోపిడీలపై విమర్శలు చేశారు.

BoyCott Adipurush : ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ ఆదిపురుష్.. రామాయణం పోలికలే లేవు.. బాలీవుడ్ మళ్ళీ అదే తప్పు చేస్తోందా??

త్వరలో రానా తమ్ముడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ అహింస అనే సినిమాతో రాబోతున్నారు తేజ. ఈ సినిమా గురించి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ.. ”మల్టీప్లెక్స్ లు సినీ పరిశ్రమని నాశనం చేస్తున్నాయి. ప్రేక్షకులని దోపిడీ చేస్తున్నాయి. అన్ని మల్టీప్లెక్స్ వాళ్ళు ఒక ముఠాలాగా ఏర్పడి దందా చేస్తున్నాయి. సగటు ప్రేక్షకుడిని థియేటర్ కి రానివ్వకుండా చేస్తున్నాయి. ఓ వైపు టికెట్ రేట్లు పెంచేశారు, మరో వైపు తినే పదార్థాలు కూడా ఇష్టారాజ్యంగా పెంచేశారు. బయట రూ.10ల పాప్‌కార్న్ 400లకి అమ్ముతున్నారు. 20 రూపాయల డ్రింక్ 200 లకి అమ్ముతున్నారు. 10,20 లాభంతో అమ్మడం తప్పులేదు కానీ మరీ 100, 200 రూపాయల లాభం అంటే ప్రేక్షకుడిని దోచేయడమే. మరోవైపు కొన్ని హాల్స్ పార్కింగ్ ఫీజులు కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇది మారేవరకు సినిమాలకి కలెక్షన్లు రావు” అని ఆవేదన వ్యక్తం చేస్తూ మల్టీప్లెక్స్ థియేటర్స్ పై ఫైర్ అయ్యారు.