Director Teja : తేజ సినిమాల్లో హీరో హీరోయిన్స్ ని కొడతారు.. నిజమేనా? అభిరామ్ కి టార్చర్ చూపించారట?

డైరెక్టర్ తేజ చాలా వరకు కొత్తవాళ్ళతోనే సినిమాలు తీస్తాడు. అయితే తన సినిమాల్లో నటించేవాళ్ళు సరిగ్గా నటించకపోయినా, తేజ మాట వినకపోయినా కొడతాడని, తిడతాడని టాక్ ఉంది.

Ahimsa : ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘అహింస’. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అహింస సినిమా జూన్ 2న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తాజాగా చిత్రయూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

డైరెక్టర్ తేజ చాలా వరకు కొత్తవాళ్ళతోనే సినిమాలు తీస్తాడు. అయితే తన సినిమాల్లో నటించేవాళ్ళు సరిగ్గా నటించకపోయినా, తేజ మాట వినకపోయినా కొడతాడని, తిడతాడని టాక్ ఉంది. గతంలో కూడా కొంతమంది కొత్త హీరోలు, హీరోయిన్స్ ని తేజ కొట్టాడని వార్తలు వచ్చాయి. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఓ విలేఖరి తేజను దీనిపై ప్రశ్నిస్తూ మీ సినిమాల్లో హీరో, హీరోయిన్స్ ని కొడతారని అంటారు, ఈ సినిమాలో ఎవర్నైనా కొట్టారా అని అడగ్గా తేజ సమాధానమిస్తూ.. నేను కొట్టింది మీరు చూశారా అని కౌంటర్ ఇచ్చాడు తేజ.

Ahimsa : వెంకటేష్ గెస్ట్‌గా అహింస ప్రెస్ మీట్.. ఫోటోలు!

అయితే ఇటీవల అభిరామ్ మాత్రం తేజ నన్ను అందరి ముందు తిట్టాడు, టార్చర్ పెట్టాడు అని చెప్పాడు. ఇదే ప్రశ్న విలేఖరి అడగ్గా తేజ దీనిపై స్పందిస్తూ.. సినిమా కోసం అభిరామ్ ని టార్చర్ పెట్టింది మాత్రం నిజమే. రామానాయుడు స్టూడియో కింద నుంచి కొండా పైకి రోజూ సైకిల్ తొక్కమని చెప్పను. నో చెప్పకుండా చేశాడు. ఒక షాట్ లో భుజంపై అమ్మాయిని ఎత్తుకొని ఇంకో చేత్తో తుపాకీ కాలుస్తూ పరిగెత్తమన్నాను. ఆ షాట్ తీస్తుండగా కింద పడి నాలుగు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది అభిరామ్. ఒక 50 కిలోల బరువుని ఇచ్చి రామానాయుడు కొండ చుట్టూ పరిగెత్తమని చెప్పాను. రోజూ పరిగెత్తి వీడియో పెట్టేవాడు. ఇంతకన్నా టార్చర్ ఎవరైనా పెడతారా? కానీ అభిరామ్ మాత్రం దేనికి అడ్డు చెప్పకుండా చెప్పినవన్నీ చేశాడు అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు