Director Teja : పాప్‌కార్న్ వల్లే సినిమా చచ్చిపోతుంది.. డైరెక్టర్ తేజ వ్యాఖ్యలు..

తాజాగా రామబాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ తేజతో గోపీచంద్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ ఇటీవల సినిమాకు ఆదరణ ఎందుకు తగ్గుతుందో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలని వెల్లడించారు.

Director Teja : పాప్‌కార్న్ వల్లే సినిమా చచ్చిపోతుంది.. డైరెక్టర్ తేజ వ్యాఖ్యలు..

Director Teja sensational comments on movies and popcorn

Director Teja : గోపీచంద్(Gopichand) మే 5న రామబాణం(Ramabanam) సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. గోపీచంద్, డింపుల్ హయతి(Dimple Hayathi) జంటగా, జగపతి బాబు(Jagapathi Babu), ఖుష్బూ ముఖ్య పాత్రల్లో శ్రీవాస్(Sriwass) దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ రిలీజయి ప్రేక్షకులని అలరిస్తున్నాయి.

తాజాగా రామబాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ తేజతో గోపీచంద్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ ఇటీవల సినిమాకు ఆదరణ ఎందుకు తగ్గుతుందో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలని వెల్లడించారు.

డైరెక్టర్ తేజ మాట్లాడుతూ.. థియేటర్స్ లో పాప్‌కార్న్ వల్లే సినిమా చచ్చిపోతుంది. పాప్‌కార్న్, కూల్ డ్రింక్ రేట్స్ చాలా దారుణంగా ఉంటున్నాయి. అవి నేనైతే భరించలేను. నేనే కాదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరూ భరించలేరు. మల్టిప్లెక్స్ లో పాప్‌కార్న్ అమ్మేవాళ్ళు, ఆ పాప్‌కార్న్ రేటు సినిమాని చంపేస్తుంది. ఓటీటీ చంపలేదు, టీవీ చంపలేదు సినిమాని. ఒక ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకు వెళ్తే పార్కింగ్ ఫీజు కట్టాలి. లోపల టికెట్ తీసుకొని వెళ్ళాక సినిమా చూస్తూ పాప్‌కార్న్ లేదా సమోసా తింటూ లేదా కూల్ డ్రింక్ తాగాలి. ఎన్నో సంవత్సరాల నుంచి చిన్నప్పుడు థియేటర్స్ లో కూడా ఏదో ఒకటి తింటూ సినిమా చూస్తున్నాం. ఇప్పుడు సినిమా టికెట్ కంటే పాప్‌కార్న్ రేటు, కూల్ డ్రింక్ రేటు ఎక్కువవడం వాళ్ళ సినిమా మీద, మల్టిప్లెక్స్ లకు వచ్చే వారికి ఇంటరెస్ట్ పోతుంది. బాలీవుడ్ చచ్చిపోయింది అని చాలా కారణాలు చెప్తున్నారు. కానీ అవేవి కావు కేవలం పాప్‌కార్న్ రేటు మాత్రమే కారణం. ఇక్కడి కంటే కూడా ముంబైలో పాప్‌కార్న్ రేటు ఇంకా ఎక్కువ అదే హిందీ సినిమాను చంపేసింది అని అన్నారు.

Nani30 : నాని సినిమాలోకి శృతిహాసన్ ఎంట్రీ.. మరి మృణాల్ ఠాకూర్?

అలాగే.. తెలుగులో మనకు ఎక్కువ సింగిల్ స్క్రీన్స్ ఉండటం వల్ల ఇంకా సినిమా ఇక్కడ చావలేదు. మెల్లి మెల్లిగా తెలుగులో కూడా అవుతుంది. నేను అయితే సింగిల్ స్క్రీన్స్ కే సినిమాకు వెళ్ళమని చెప్తా. అక్కడ స్క్రీన్ కూడా పెద్దది. మల్టిప్లెక్స్ లలో స్క్రీన్ చిన్నది. ఇటీవల కొన్ని సింగిల్ స్క్రీన్స్ ని మల్టిప్లెక్స్ ల కింద మార్చేస్తున్నారు. అలా మార్చిన చోట సినిమా చచ్చిపోతుంది. కాబట్టి పాప్‌కార్న్ రేటు తగ్గించకపోతే చాలా మంది జనాలకు తింటూ సినిమా చూసే అలవాటు వల్ల సినిమా చచ్చిపోతుంది. ఓటీటీలు కానీ వేరే ఏవి కానీ సినిమాను చంపలేవు. కేవలం పాప్‌కార్న్ సినిమాని చంపేస్తుంది అని తెలిపారు. దీంతో తేజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.