Director Teja : ఎన్టీఆర్ బయోపిక్‌ని వెబ్ సిరీస్‌గా అయినా తీస్తా.. జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్.. తేజ కామెంట్స్!

అప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌ని నుంచి తప్పుకున్న తేజ.. ఇప్పుడు ఆ బయోపిక్ ని వెబ్ సిరీస్ గా తీస్తాను అంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అయితే..

Director Teja : ఎన్టీఆర్ బయోపిక్‌ని వెబ్ సిరీస్‌గా అయినా తీస్తా.. జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్.. తేజ కామెంట్స్!

Director Teja want to do NTR Biopic as web series with junior ntr

NTR Biopic : నందమూరి తారక రామారావు బయోపిక్ గా తెరకెక్కిన సినిమాలు NTR – కథానాయకుడు, NTR – మహానాయకుడు. బాలకృష్ణ (Balakrishna) ఎన్టీఆర్ పాత్ర పోషిస్తూ చేసిన ఈ మూవీని క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేశాడు. అయితే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు ముందుగా తేజకి వెళ్లాయి. తేజ చేతులు మీద ప్రారంభమైన ఈ బయోపిక్ కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే సడన్ గా ఆ ప్రాజెక్ట్ నుంచి తేజ తప్పుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజ ఈ విషయం గురించి మాట్లాడాడు.

Director Teja : పాప్‌కార్న్ రేట్.. మల్టీప్లెక్స్ చైర్మన్‌కి గట్టి కౌంటర్ ఇచ్చిన తేజ.. డిబేట్ కూడా సిద్ధం!

తేజ మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ బయోపిక్ ని చాలా గొప్పగా తియ్యవచ్చు. అయితే నేను అనుకున్న విజన్ కి నేను తీస్తున్న మూవీకి మ్యాచ్ అవ్వడం లేదు. దీంతో నాకు వద్దు అనిపించింది. అలాంటి బయోపిక్ ని నాకు చెడగొట్టడం ఇష్టం లేదు. అందుకనే ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకి వచ్చేశాను” అని చెప్పుకొచ్చాడు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ ని తియ్యలేకపోయాను అన్న ఒక బాధ తనలో అలానే ఉండిపోయిందని, ఆయన బయోపిక్ ని ఎప్పటికి అయినా తీయాలి అనేది తన ఆశని వెల్లడించాడు. ఒకవేళ కుదిరితే వెబ్ సిరీస్ గా ఆ బయోపిక్ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తాను అంటూ పేర్కొన్నాడు.

K Vasu : ఇండస్ట్రీలో మరో విషాదం.. చిరంజీవి ఫస్ట్ మూవీ దర్శకుడు మృతి..

ఇక ఆ వెబ్ సిరీస్ తీస్తే ఎన్టీఆర్ గా ఏ నటుడుని పెడతారు అని ప్రశ్నించగా.. జూనియర్ ఎన్టీఆర్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని చెప్పుకొచ్చాడు. మరి ఈ బయోపిక్ వెబ్ సిరీస్ అనేది జరుగుతుందా? లేదా? చూడాలి. కాగా ఇప్పటి వరకు బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చూడలేదని చెప్పుకొచ్చాడు. అలానే తన కొడుకు హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ఆ విషయం గురించి మాట్లాడుతూ.. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.