Brahmanandam in Keedaa Cola : వీల్ చైర్‌లో బ్రహ్మి కామెడీ.. మీమ్ క్రియేటర్ డైరెక్షన్‌లో మీమ్ గాడ్..

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో మీమర్స్ కి ఎన్నో మీమ్స్ క్రియేట్ చేసి ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తన కొత్త ప్రాజెక్ట్ ని ఇటీవలే అనౌన్స్ చేశాడు. ‘కీడా కోలా’ అనే టైటిల్ ని పెట్టుకున్న ఈ చిత్రంలో అందరూ కొత్తవాళ్లు నటించబోతున్నారు. అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం ఇప్పటి వరకు కనిపించని ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు అని తరుణ్ భాస్కర్ తెలియజేశాడు.

Brahmanandam in Keedaa Cola : వీల్ చైర్‌లో బ్రహ్మి కామెడీ.. మీమ్ క్రియేటర్ డైరెక్షన్‌లో మీమ్ గాడ్..

Brahmanandam in Keedaa Cola

Brahmanandam in Keedaa Cola : టాలీవుడ్ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 1) కావడంతో సోషల్ మీడియా అంతా సందడి సందడిగా ఉంది. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ ఎంతోమందిని అలరిస్తుంటాయి. ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ లో మీమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. కేవలం సినీ రంగంలోనే కాదు ఇప్పుడు ఇప్పుడే మీమ్స్ ట్రెడిషన్ రాజకీయ రంగంలోకి కూడా ఎంటర్ అవుతున్నాయి. మరి ఇంతటి పాపులారిటీ సంపాదించుకుంటున్న మీమ్స్ కి మూలం, మీమర్స్ కి గాడ్ అయిన బ్రహ్మానందం బర్త్ డే అయితే సోషల్ మీడియాలో ఇంకెంత రచ్చ ఉంటాదో చెప్పనక్కరలేదు.

Tharun Bhascker Keedaa Cola : రాజమౌళి ఈగతో వస్తే.. తరుణ్ భాస్కర్ బొద్దింకతో రాబోతున్నాడు.. కీడా కోలా అప్డేట్!

అర్ధరాత్రి 12 గంటల నుంచే రకరకాల మీమ్స్ చేస్తూ బ్రహ్మికి విషెస్ తెలియజేస్తున్నారు. అయితే గత కొంత కాలంగా బ్రహ్మానందం సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడంతో మీమర్స్ అండ్ ఆడియన్స్ చాలా బాధ పడుతున్నారు. వారందరికీ ఒక శుభవార్త. ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ పాత్రతో బ్రహ్మి మనముందుకు రాబోతున్నాడు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో మీమర్స్ కి ఎన్నో మీమ్స్ క్రియేట్ చేసి ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తన కొత్త ప్రాజెక్ట్ ని ఇటీవలే అనౌన్స్ చేశాడు.

‘కీడా కోలా’ అనే టైటిల్ ని పెట్టుకున్న ఈ చిత్రంలో అందరూ కొత్తవాళ్లు నటించబోతున్నారు. అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం ఇప్పటి వరకు కనిపించని ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు అని తరుణ్ భాస్కర్ తెలియజేశాడు. బ్రహ్మి బర్త్ డే సందర్భంగా మూవీలో బ్రహ్మి క్యారెక్టర్ రెవీల్ చేశాడు. ఈ మూవీలో బ్రహ్మి.. ముసలివాడిగా యూరిన్ బాగ్ అటాచ్‌మెంట్ తో వీల్ చైర్ కే అంకితమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో బ్రహ్మి పాత్ర పేరు ‘వరదరాజు’. అంతేకాదు ఈ క్యారెక్టర్ గురించి ఒక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు తరుణ్ భాస్కర్. ‘పేరు వరద పోసేది పితుకంత’ అనే స్టేట్‌మెంట్ క్యారెక్టర్ ఏంటో చెప్పేశాడు. ఇక ఈ న్యూస్ తెలిశాక ఎప్పుడెప్పుడు ‘వరదరాజు’ని చూస్తామా? అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.

 

View this post on Instagram

 

A post shared by Tharun Bhascker Dhaassyam (@tharunbhascker)