Venky Atluri : మీమ్స్ వల్లే అలాంటి సినిమాలు తీయకూడదని ఫిక్స్ అయ్యా.. డైరెక్టర్ వెంకీ అట్లూరి..

వెంకీ అట్లూరి మాట్లాడుతూ..నేను కూడా మీమ్స్ ఎక్కువగా ఫాలో అవుతా. నా రంగ్ దే సినిమా రిలీజ్ అయ్యాక చాలా మీమ్స్ వచ్చాయి నా మీద. ఒకవేళ నేను నారప్ప సినిమా తీస్తే దాని కూడా సెకండ్ హాఫ్ లో ఫారిన్ లో తీస్తాను అని పెట్టారు. ఈ సినిమాలో..........

Venky Atluri : మీమ్స్ వల్లే అలాంటి సినిమాలు తీయకూడదని ఫిక్స్ అయ్యా.. డైరెక్టర్ వెంకీ అట్లూరి..

Director Venky Atluri reacts on memes about his movies

Director Venky Atluri : తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి లవ్ స్టోరీలు తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో వాతి సినిమాని తెరకెక్కించాడు. తమిళ్ లో వాతిగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో సార్ గా రిలిజ్ అవుతుంది. సార్ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ని చెన్నైలో ఘనంగా నిర్వహించారు. తాజాగా సార్ సినిమా ట్రైలర్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు ధనుష్ కూడా వచ్చి సందడి చేశారు.

అయితే డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇప్పటివరకు తీసిన మూడు సినిమాలు లవ్ స్టోరీస్ అవ్వడం, మూడు సినిమాల్లోనూ సెకండ్ హాఫ్ ఫారిన్ లో ఉండడం కామన్. దీనిపై నెటిజన్లు, మీమర్లు గతంలో ట్రోల్స్ చేశారు. తాజాగా వెంకీ అట్లూరి సార్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ దీనిపై స్పందించారు.

Amigos : శేఖర్ కమ్ముల టైటిల్ వాడేసిన కళ్యాణ్ రామ్.. ఈ సినిమాకి పేరు ఎలా పెట్టారో తెలుసా??

వెంకీ అట్లూరి మాట్లాడుతూ..నేను కూడా మీమ్స్ ఎక్కువగా ఫాలో అవుతా. నా రంగ్ దే సినిమా రిలీజ్ అయ్యాక చాలా మీమ్స్ వచ్చాయి నా మీద. ఒకవేళ నేను నారప్ప సినిమా తీస్తే దాని కూడా సెకండ్ హాఫ్ లో ఫారిన్ లో తీస్తాను అని పెట్టారు. ఈ సినిమాలో ఫారిన్ ఎపిసోడ్ లేదు. ఇంకా చాలా మీమ్స్ చూశా. అవన్నీ చూసి ఇంక చాలు పూర్తిగా లవ్ స్టోరీ ఉండే సినిమాలు చేయకూడదు అని డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత సార్ కథ రాసి నాగవంశీ గారికి చెప్తే ఆయన ద్వారా ధనుష్ గారికి చెప్పాను. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కథ చెప్పాను. సినిమా ఓకే చేసినా చేయకపోయినా కథ వింటే చాలు అనుకున్నాను. కానీ కథ విన్నాక, డేట్స్ ఎప్పుడు కావాలి అని అడిగారు ధనుష్ సార్ అని తెలిపాడు. ఇక సార్ సినిమా విద్యావ్యవస్థలో ఉన్న లోపాలు, అక్రమాల గురించి ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది.