Movie Promotions: డైరెక్టర్లే యాంకర్లు.. మారుతున్న తెలుగు సినిమా ప్రమోషన్!

వందల కొద్దీ సినిమాలు.. పదుల కొద్దీ స్టార్ హీరోలు.. వాటిల్లో ఆడియన్స్ కి మన సినిమా గుర్తుండాలంటే.. సమ్ థింగ్ డిఫరెంట్ గా ప్రమోట్ చెయ్యాలి. అందుకే సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.

Movie Promotions: డైరెక్టర్లే యాంకర్లు.. మారుతున్న తెలుగు సినిమా ప్రమోషన్!

Movie Promotions

Movie Promotions: వందల కొద్దీ సినిమాలు.. పదుల కొద్దీ స్టార్ హీరోలు.. వాటిల్లో ఆడియన్స్ కి మన సినిమా గుర్తుండాలంటే.. సమ్ థింగ్ డిఫరెంట్ గా ప్రమోట్ చెయ్యాలి. అందుకే సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ప్రమోషన్లు చేస్తూ.. ఆడియన్స్ కి సినిమాని రీచ్ చేస్తున్నారు. ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇప్పుడు కామన్ అయిపోయాయి. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకూ అందరూ ఈ ఫంక్షన్స్ చేస్తూనే ఉన్నారు.

Promotional Songs: భారీ బడ్జెట్‌తో ప్రమోషన్ సాంగ్స్ చేస్తున్న మేకర్స్!

అయితే.. అదే ఇంటర్వ్యూలు, అదే ఈవెంట్లు, అదే ప్రమోషన్లలో కూడా కాస్త కొత్తదనంగా ప్లాన్ చేస్తున్నారు మన మేకర్స్. అందులో భాగంగానే ఈవెంట్లతో యంగ్ హీరోలను యాంకర్లుగా మారుస్తుంటే.. ఇంటర్వ్యూలలో దర్శకులను యాంక్టర్లుగా మారుస్తున్నారు. ఆ మధ్య రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి యాంకరింగ్ చేసి తనదైన శైలిలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ వేడుక తర్వాత స్టార్ హీరోల సినిమా వేడుకలకు యంగ్ హీరోలతో యాంకరింగ్ చేస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ మొదలైంది.

RRR Promotions: దర్శక దిగ్గజం జక్కన్న.. ఓ ఆట ఆడేసుకున్న హీరోలు!

కాగా.. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూలలో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో రాజమౌళి ఇంటర్వ్యూ, అనిల్ రావిపూడితో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఇంటర్వ్యూ ఎంత హైలెట్ అయ్యాయో చూశాం. ఇక తాజాగా ఆచార్య ప్రమోషన్ ఇంటర్వ్యూలలో కూడా ఇదే తరహా సంప్రదాయం కనిపించింది. దర్శకుడు హరీష్ శంకర్ ఇద్దరు హీరోలతో పాటు దర్శకుడు కొరటాలను ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూ కూడా బాగానే హైలెట్ అయింది. ఈ పరిస్థితి చూస్తుంటే.. భవిష్యత్ లో కూడా ఇలానే ఒకరి సినిమాలకు మరొక హీరోలు, దర్శకులే యాంకర్లుగా ప్రమోషన్ల మోత మోగించేలా కనిపిస్తుంది.