Movies : పాన్ ఇండియా సినిమాలు.. ఒత్తిడిలో దర్శకులు..

పేరుకే స్టార్ డైరెక్టర్స్, కానీ వీళ్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు ఇప్పుడు. సినిమా సక్సెస్ అయితే ఓ రకంగా, ఫ్లాప్ కొడితే మరో రకంగా నెక్ట్స్ చేయబోయే ప్రాజెక్ట్స్ పై టెన్షన్ టెన్షన్ పడుతున్నారు. ఉన్నట్టుండి తోటి డైరెక్టర్లు బ్లాక్ బస్టర్స్ సాధిస్తే..........................

Movies : పాన్ ఇండియా సినిమాలు.. ఒత్తిడిలో దర్శకులు..

Directors

Directors :  పేరుకే స్టార్ డైరెక్టర్స్, కానీ వీళ్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు ఇప్పుడు. సినిమా సక్సెస్ అయితే ఓ రకంగా, ఫ్లాప్ కొడితే మరో రకంగా నెక్ట్స్ చేయబోయే ప్రాజెక్ట్స్ పై టెన్షన్ టెన్షన్ పడుతున్నారు. ఉన్నట్టుండి తోటి డైరెక్టర్లు బ్లాక్ బస్టర్స్ సాధిస్తే మిగిలిన వారికి చెమటలు పడుతున్నాయి. అంతకుమించిన బొమ్మ ఎలా చూపించాలా అని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విజయం, పరాజయం… అంతిమంగా రిజల్ట్ ఎలాంటిదైనా చివరికి మిగిలేది ఒకటే. సినిమా సక్సెస్ సంతోషం ఎంతో సేపు ఉండట్లేదు మన స్టార్ డైరెక్టర్స్ కి. ఇక ఫెయిల్యూర్ సాధిస్తే అది మరో రకమైన టార్చర్ చూపిస్తోంది. మొత్తానికి టాప్ డైరెక్టర్లు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. అంతకుమించి అనిపించేలా నెక్ట్స్ ప్రాజెక్ట్ ను చూపించేందుకు విపరీతంగా ఆలోచిస్తున్నారు.

పక్క వాళ్ల సూపర్ సక్సెస్ కూడా కొందరు దర్శకులని నిద్రపోనివ్వట్లేదు. వాళ్ల కంటే బిగ్ సక్సెస్ ఎలా కొట్టాలా అంటూ తీవ్ర ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారు. హీరోల కండీషన్స్, నిర్మాతల ఎక్స్ పెక్టేషన్స్ మధ్య నలిగిపోతున్నారు. మొత్తానికి చెయ్యబోయే ప్రాజెక్ట్స్ పై టెన్షన్ టెన్షన్ పడుతున్నారు. ఇదేదో ఒరిద్దరి దర్శకుల బాధ కాదు. టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న ప్రతీ డైరెక్టర్ ఇప్పుడు సింపుల్ గా సెట్స్ పైకి వెళ్లలేకపోతున్నారు. పాన్ ఇండియా వేదికగా టాలీవుడ్ ఎదిగాక దర్శకులపై ఈ ఒత్తిడి మరింత పెరిగింది. నేషనల్ వైడ్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా కథలు సిద్దం చేసుకోవడంలో నానా తంటాలు పడుతున్నారు. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న జక్కన్నతో పాటూ కేజీఎఫ్ లాంటి సినిమాతో ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో కొందరు దర్శకులు ఇప్పటికే సిద్ధమైన స్క్రిప్ట్ లో కూడా భారీగా మార్పులు చేస్తున్నారు.

ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్… అందరికీ ఊపునిచ్చాడు. కానీ ఆయనేమైనా ఫుల్ జోష్ తో లైఫ్ లీడ్ చేస్తున్నాడా అంటే అదేం లేదు. ఎందుకుంటే కేజీఎఫ్ సక్సెస్ ఆయనకు మెడ మీద కత్తిలా మారింది. నెక్ట్స్ ఆయనతో చేస్తోన్న హీరోలు, ప్రొడ్యూసర్లు, వీళ్ల కంటే ఎక్కువగా ప్రేక్షకులు ఆయన నుంచి మరింత గ్రాండ్ గా, మ్యాసివ్ గా అవుట్ పుట్ కోరుకుంటారు. ఆ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ కావాలంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ప్రశాంత్ నీల్ ఉదాహరణ మాత్రమే. ఇప్పుడు కమర్షియల్ లెక్కలు చూపించిన ప్రతీ డైరెక్టర్ ముళ్ల మీద కూర్చొని తర్వాతి సినిమాల కోసం కష్టపడుతున్నారు.

Siddanth Kapoor : బాలీవుడ్‌లో మళ్ళీ డ్రగ్స్ కలకలం.. అడ్డంగా దొరికిపోయిన శ్రద్దాకపూర్ సోదరుడు సిద్దాంత్‌ అరెస్ట్..

ఇప్పుడో సినిమా ప్రీప్రొడక్షన్ పూర్తవ్వాలంటే కత్తి మీద సామే. అన్నీ సమపాళ్లలో కుదిరితేనే షూటింగ్ మొదలవుతోంది. గ్రాండియర్ మోడ్ లో ఓ ప్రాజెక్టును రెడీ చేయాలంటే లెక్కకు మించిన కొలతలు కుదరాలి. ఇప్పటి దర్శకులు పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కావాలంటే ఇవన్నీ కరెక్ట్ గా చేసుకోవాల్సిందే.. స్క్రిప్ట్ మాత్రమే లాక్ చేస్తే సరిపోదిప్పుడు, కంటెంట్ కు సరిపడా సరుకును సిద్ధం చేయాలి. ఎంతటి హీరోనైనా కంటెంట్ కుదిరితేనే జనం ఆదరిస్తున్నారు. సబ్జెక్టులో దమ్ములేకుంటే పోపోవోయ్ అనేస్తున్నారు. సో అందరినీ మెప్పించే కంటెంట్ కావాలిప్పుడు. భారీ బడ్జెట్ సినిమా, పాన్ ఇండియా లుక్ అంటే హాలీవుడ్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దింపాలి. మన దగ్గరే ఉన్న పేరున్న సినిమాటోగ్రాఫర్స్ తో పాటూ అందరూ అర్థం చేసుకునేలా చేయగలగాలి. ముఖ్యంగా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడకుండా ముందుకెళ్లాలి.

బడ్టెట్ లో మాక్సిమమ్ పార్ట్ VFX ఎఫెక్ట్స్ కే ఖర్చు చేస్తున్నారు. అనుకున్న సబ్జెక్ట్ పీరియాడికల్ అయితే ఒరిజనల్ లుక్ తీసుకురావాలి. ఎంచుకున్న కాలంలో ప్రేక్షకుడికి కూర్చోబెట్టగలగాలి. ఎక్కడా గ్రాఫిక్స్ అనే అనుమానం రాకుండా రియాలిటీని అందుకోవాలి. లేటెస్ట్ గా ప్రభాస్ ఆదిపురుష్ మాక్సిమమ్ గ్రీన్ మ్యాట్ లోనే షూట్ చేసుకుంది. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K, క్రిష్ హరిహర వీరమల్లుతో పాటూ చాలా సినిమాలు గ్రాఫిక్స్ ఆధారంగానే రానున్నాయి. సో ఈ విషయంలో జాగ్రత్త పడాల్సింది కూడా దర్శకుడే.

సినిమా మొదలైన దగ్గరి నుంచి ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసే వాటిలో ముఖ్యమైనది మ్యూజిక్. పాటలు ఫుల్ గా కనెక్ట్ అయితే సినిమా సగం సక్సెస్ సాధించినట్టే అని చెబుతారు. సో సరైన మ్యూజిక్ డైరెక్టర్ ను సెలెక్ట్ చేసుకోవడం కూడా దర్శకుడిపైనే ఆధారపడి ఉంది. ఇక RR కూడా సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఈమధ్య విక్రమ్, కేజీఎఫ్ 2, అఖండ RRతోనే థియేటర్స్ దద్దరిల్లేలా చేసాయి. ఎలివేషన్ సీన్స్ ను హైలెట్ చేయాలంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరాల్సిందే. కంటెంట్ కి దగ్గ మ్యూజిక్ రావాలంటే సంగీత దర్శకుడి మీద సినిమా దర్శకుడు ఓ కన్ను వేయాల్సిందే.

Adivisesh : మహారాష్ట్ర సీఎంని కలిసిన మేజర్ టీం..

రిచ్ కంటెంట్ కి తోడూ లోకేషన్స్ కూడా రిచ్ గానే ఉండాలి. ప్రేక్షకుడి కళ్లకు కొత్తగా కనిపించాలి. స్క్రీన్ నుంచి కళ్లు తిప్పకుండా చేయగలగాలి. లోకషన్ విషయంలో ఎంతమంది హెల్ప్ తీసుకున్న తాను అనుకున్న కథకు సరిపోయే ప్లేసెస్ కోసం దర్శకుడు కష్టపడాల్సిందే. గంధపు చెక్కల బ్యాక్ డ్రాప్ కోసం సుకుమార్, పీరియాడికల్ టైమ్ కోసం రాజమౌళి, బంగారు గనులను కళ్ల ముందుంచేలా ప్రశాంత్ నీల్, భీమ్లానాయక్ ను చూపించిన సాగర్ చంద్ర, సముద్రాన్ని బ్యాక్ డ్రాప్ చేసుకున్న బుచ్చిబాబు.. వీళ్లంతా అనుకున్నంత అందంగా ప్రెజెంట్ చేయగలిగారు గనుకే సక్సెస్ సాధించారు.

స్టార్ కాస్ట్… సినిమాలో ఎంత మంచి నటీనటులు కనిపిస్తే ప్రేక్షకుల్లో అంత వ్యాల్యూ పెరుగుతుంది. స్టార్ హీరో, హీరోయిన్ ను సెట్ చేసుకోవడమే ఓ పెద్ద టాస్క్ దర్శకుడికి. ఆపై హై ఇంటెన్స్ పర్ఫామెన్స్ కోసం మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులను పట్టుకురావాలి. పాత్రకు తగ్గవారిని ఎంచుకోవాలి. ట్రిపుల్ ఆర్ లో హాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్స్, కేజీఎఫ్ లో రవీనా టాండన్, సంజయ్ దత్. పుష్పలో ఫహాద్ ఫాజిల్ బలమైన ముద్ర వేయగలిగారంటే వాళ్లని తెచ్చుకున్న డైరెక్టర్ పనితనమే. ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో కీ క్యారెక్టర్స్ కోసం అన్ని లాంగ్వేజ్ ల వారిని సెర్చ్ చేస్తుండటం డైరెక్టర్ పై మరింత భారాన్ని పెంచేస్తోంది.

కావాల్సిన లోకేషన్ కోసం ఫారెన్ కి వెళ్లాల్సి రావొచ్చు. సరైన ప్రెజెంటేషన్ కోసం గ్రాఫిక్స్ కి టైమ్ పట్టొచ్చు. కీ క్యారెక్టర్స్ కోసం పేరున్న యాక్టర్స్ ను తీసుకోవాల్సి వస్తోంది. సినిమాటోగ్రాఫర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ వరకు క్రేజ్ ఉన్న వాళ్లే కావాలి. రిలీజ్ కి ముందు పబ్లిసిటీ స్టంట్స్ ప్రదర్శించాలి కూడా. ఇన్ని చూసుకుంటూ బడ్జెట్ మార్జిన్ దాటొద్దు డైరెక్టర్. అసలే భారీ బడ్జెట్ అని చెప్పి బొక్క బోర్లా పడుతున్న రోజులివి. భారీ, మీడియం, లో… ఇలా పెట్టే బడ్జెట్ ఏ రేంజ్ లో ఉన్నా దర్శకుడు నిర్మాత అనుకున్న బార్డర్ దాటకూడదు. రాజమౌళిలాంటి క్రెడిబిలిటీ ఉన్న కొందరిని మినహాయిస్తే మిగిలిన దర్శకులందరూ పరిమితుల్లోనే పనిచేయాలి. ఎందుకంటే భారీ బడ్టెట్ పేరుతో కోట్లు ఖర్చు పెట్టి చివరికి జనాల్ని మెప్పించలేక చేతుల్ని కాల్చుకున్న వారిని ఈమధ్య చూశాం. సో అనుకున్న లిమిట్స్ లో సినిమాను పూర్తి చేసి అంతకుమించి కలెక్షన్స్ రాబడితే దర్శకులకి వచ్చే కిక్కే వేరు.

Saipallavi : విరాటపర్వం ఆత్మీయ వేడుకలో సాయిపల్లవి

రాజమౌళి, శంకర్ సినిమాలంటే భారీ లెవెల్ చూపించేవి. కానీ నేషనల్ మూవీగా సౌత్ సినిమా ఎదిగాక ప్రతి ఒక్కరూ పెద్ద సినిమాలను భారీ బడ్జెట్ లను కోరుకుంటున్నారు. 100కోట్ల పరిథిలోనే కె.జి.యఫ్ చూపించిన ప్రశాంత్ నీల్ నెక్ట్స్ సినిమాల కోసం బడ్జెట్ పెంచేసాడు. పుష్ప2 కోసం సుకుమార్ కూడా అంచనాలకు మించిన పెట్టుబడి కోరుకుంటున్నాడు. కొరటాల, పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్స్ సైతం హై బడ్జెట్ అనేస్తున్నారు. అయితే లోబడ్జెట్ లో కంటెంట్ ను కనెక్ట్ చేసి కోట్లు కొల్లగొట్టిన ఉప్పెన, జాతిరత్నాలు లాంటి సినిమాలది డిఫరెంట్ ట్రాక్.

ఏ రేంజ్ లో బడ్జెట్ పెట్టి సినిమా పూర్తి చేసినా చివరికి ప్రమోషన్స్ క్రేజ్ చూపిస్తేనే గ్రాండ్ ఓపెనింగ్స్ సాధ్యం. ఈ విషయంలో రాజమౌళినే మిగిలిన వారికి ఆదర్శం. పబ్లిసిటీ కోసం జక్కన్న టిప్స్ ను ఫాలో అవుతున్నారు. అయితే ఎలా ప్రమోషన్స్ బిగిన్ చేయాలి, ఎప్పుడు ఫస్ట్ లుక్, టీజర్స్, సాంగ్స్, ఈవెంట్స్ ప్లాన్ చేయాలనే టాస్క్ కూడా దర్శకుడి నెత్తిమీదే పడుతోంది. పబ్లిసిటీ స్టాఫ్ సపరేట్ గా ఉన్నా వాల్లని గైడ్ చేయాల్సిన బాధ్యత డైరెక్టర్ దే.

ఇప్పుడు స్టార్ హీరో – స్టార్ డైరెక్టర్ క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. అప్పుడు ఇప్పుడు అంటున్నారు కానీ సెట్స్ మీదికెళ్లేందుకు ఇంకా టైమ్ కావాలంటున్నారు. ఇదేదో ఒకరిద్దరి విషయంలో జరుగుతున్నది కాదు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు మాక్సిమం హోల్డ్ మోడ్ లోనే ఉన్నారు. వీళ్లతో చేయి కలిపిన దర్శకులు ఎప్పుడూ పడని కుస్తీలు పడుతున్నారు. సర్కారు వారి పాట తర్వాత సూపర్ స్టార్ మహేష్… త్రివిక్రమ్, రాజమౌళితో చేయనున్నారన్న సంగతి తెలిసిందే. అయితే మహేశ్ ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్, బాహుబలి2 కి మించిన సక్సెస్ చూడాలనేది జక్కన్న డ్రీమ్. అందుకే స్టోరీ దగ్గరి నుంచి యాక్టర్స్ ను పిక్ చేసుకునేవరకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు రాజమౌళి. 2023 నుంచి రాజమౌళికి బల్క్ కాల్షీట్స్ ఇచ్చిన మహేశ్ త్వరలో త్రివిక్రమ్ తో సెట్స్ మీది కెళ్తారు. అయితే మహేశ్ కోసం స్టోరీని ఫైనలైజ్ చేయడానికి త్రివిక్రమ్ కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. మెన్నీమధ్యే జర్మీనీ వెళ్లి మహేశ్ కి ఫైనల్ వర్షన్ నేరేట్ చేసారు. యాక్టర్స్ ను ఫిక్స్ చేయడంలో కూడా ఎక్కువగా ఆలోచిస్తున్న త్రివిక్రమ్ మరి సినిమా ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి.

Surendra Reddy

 

 

పుష్ప పార్ట్ 1తో ఊహించని విజయం అందుకున్న సుకుమార్ పుష్ప ది రూల్ కోసం మైండ్ సెట్ మార్చుకున్నారు. కథలో చాలా మార్పులు చేసి బడ్జెట్ ను అమాంతం పెంచేసారు. నార్త్ ఆడియెన్స్ ను సైతం మెప్పించేలా సెకండ్ పార్ట్ కోసం ఎలివేషన్ సీన్స్ రాసుకుంటున్నారు సుకుమార్. బన్నీ వాస్ ఇచ్చిన అప్ డేట్ ప్రకారం జూలై చివరి వారంలో పుష్ప 2 షూటింగ్ మొదలుకానుంది. 2023 వేసవిలో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. పుష్ప 1లో ఉన్నవారితో పాటూ కొత్త వారిని కలుపుకుని భారీ కాస్ట్ సెట్ చేసుకుంటున్నారు సుక్కూ. ఇప్పటికే నార్త్ ఆడియెన్స్ లో తనదైన ముద్ర వేసిన బన్నీ పుష్ప 2తో అల్టిమేట్ అనిపించుకునేందుకు లెక్కల మాస్టారికి కావాల్సినంత టైమ్ ఇస్తున్నారు.

Adivi Sesh : ఆ రోజు పంజా.. ఈ రోజు మేజర్.. పవన్ కి థ్యాంక్స్ చెప్తూ అడవిశేష్ స్పెషల్ ట్వీట్..

ఆచార్య రిజల్ట్ తో చతికిలబడ్డ కొరటాల శివపై భారం మరింత పెరిగింది. ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ రూపంలో ప్రెజర్ పొంచి ఉంది. భారీ బడ్టెట్ తో పాన్ ఇండియా సినిమానే తారక్ కోసం ప్లాన్ చేసారు కొరటాల. ఎప్పుడో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ స్క్రిప్ట్, కంటెంట్ పరంగా ఎన్టీఆర్ 30 కోసం విపరీతంగా కష్టపడుతోన్న కొరటాల షూటింగ్ ను ఆగ‌స్టు నుంచి స్టార్ట్ చేస్తారని సమాచారం. వచ్చే సమ్మర్ కే సినిమా రిలీజ్ ప్లాన్ చేసిన కొరటాల ప్రస్తుతం నటీనటులు, టెక్నికల్ టీమ్ సెలెక్షన్ విషయంలో కసరత్తులు చేస్తున్నారు.

 

కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ అంతకుమించిన కలెక్షన్స్ రాబట్టేందుకు చెమటోడుస్తున్నారు. అసలే ప్రభాస్ కి క్రేజీ సినిమాలు చేతిలో ఉన్నాయి కానీ బాహుబలి2 లాంటి హిట్ మళ్లీ తగలలేదు. సో సలార్ అల్టిమేట్ సక్సెస్ కోసం ఆకలితో ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. కెజీఎఫ్ తర్వాత కావడంతో ప్రశాంత్ నీల్ పై భారీగా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. అటు ప్రభాస్ తర్వాత తారక్ తో ప్రశాంత్ సినిమా ఉంది. సో పైకి కూల్ గా కనిపిస్తోన్నా ఈ రెండు సినిమాల అంచనాలను అందుకునేందుకు ఎప్పుడూ లేని ఒత్తిడికి లోనవుతున్నారు ప్రశాంత్ నీల్.

భారీ సినిమాల దర్శకుడిగా పేరున్న శంకర్ రామ్ చరణ్ మూవీతో తిరిగి ఛరిష్మాను సాధించాలనుకుంటున్నారు. RC15 కోసం దిల్ రాజుతో బాగానే ఖర్చు పెట్టిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ మల్టీస్టారర్, తండ్రితో వచ్చిన ఆచార్య తెలుగులో ఫ్లాప్. సో చరణ్ కిప్పుడు పాన్ ఇండియా లెవల్లో సింగిల్ గా సాలిడ్ హిట్ కావాలి. శంకర్ కి అంతే. అందుకే చరణ్ మూవీ కోసం శంకర్ లిమిట్స్ దాటి కష్టపడుతున్నారు.

రిలీజ్ కి ముందే లైగర్ తో పూరీ జగన్నాథ్ నేషనల్ క్రేజ్ దక్కించుకున్నారు. కరణ్ జోహార్ లాంటి ప్రొడ్యూసర్ యాడ్ కావడంతో పూరీ – రౌడీబాయ్ సినిమాకు నార్త్ లో ట్రాక్ ఈజీగా దొరికింది. బట్ దాన్ని నిలబెట్టుకునేందుకు లైగర్ ను అల్టిమేట్ గా రెడీ చేస్తున్నారు పూరీ. ఇక సేమ్ విజయ్ దేవరకొండతోనే జనగణమనను లాంచ్ చేసాడు పూరీ. జనగణమన పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్. పవన్, మహేశ్ లాంటి స్టార్స్ కుదరక విజయ్ తోనే తన కళ నెరవేర్చుకుంటున్నారు పూరీ. అదీ శ్రీకర స్టూడియోస్ నిర్మాణంలో. ఇటు లైగర్, అటు జనగణమన రెండింటితో గట్టిగా నిలబడేందుకు పూరీ బాగా శ్రమిస్తున్నారు.

Nidhhi Agerwal : ఓటీటీ కంటే సినిమాకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను..

చిరంజీవి నెక్ట్స్ దర్శకులపై ఆచార్య ఎఫెక్ట్ బలంగా పడింది. కొత్తగా చిరూ పెట్టిన కండీషన్స్ కూడా వాళ్ల ఎదురుగా ఉన్నాయి. రోటీన్ మాస్ మసాలా కాకుండా కొత్తగా ట్రై చేయాలనే ఆలోచనతో బాబీ, మెహర్ రమేశ్ ఇంకా ఇంకా ఆలోచించాల్సి వస్తోంది. చిరూ కటౌట్ తో పాటూ బలమైన కంటెంట్ కావాలని వాళ్లు తెలుసుకున్నారు. అందుకే వాల్తేర్ వీరయ్య, భోళాశంకర్ సినిమాల అవుట్ పుట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

బోయపాటి, వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి లాంటి దర్శకులకిప్పుడు సరైన హిట్ కావాలి. కోలీవుడ్ స్టార్ విజయ్ ను నేరుగా తెలుగులో పరిచయం చేస్తోన్న బాధ్యత వంశీపైడిపల్లిపై ఉంది. సేమ్ టైమ్ పైడిపల్లికి గుర్తుండిపోయే సక్సెస్ దొరకాలి. అటు అఖిల్ తో స్పై థ్రిల్లర్ చూపించి అఖిల్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని, తిరిగి తానూ సూపర్ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని సురేందర్ రెడ్డి చూస్తున్నాడు. అందుకే రీషూట్ చేసి మరీ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు. ఇక అఖండతో బాలయ్యకు ఎనర్జిట్ హిట్ ఇచ్చిన బోయపాటి అనుకున్న ప్రకారం బన్నీతో సినిమా చేయలేకపోయాడు. బట్ మాస్ బాంబ్ లా తయారైన రామ్ తో మాస్ జాతర చూపించాలని డిసైడయ్యారు. అదీ పాన్ ఇండియా లెవెల్లో.

ఇలా స్టార్ డైరెక్టర్స్ నుంచి మొదటి సినిమా, చిన్న సినిమాతో హిట్ కొట్టేసిన బుచ్చిబాబు, సందీప్ వంగ, తరుణ్ భాస్కర్, సందీప్, వెంకటేష్ మహా.. లాంటి కొత్త దర్శకుల వరకు పాన్ ఇండియా, ప్రేక్షకులకి నచ్చాలి, కలెక్షన్స్ రావాలి లాంటి ఎన్నో అంశాలు మైండ్ లో పెట్టుకొని బెస్ట్ సినిమా ఇవ్వడానికి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.