డిస్కోరాజా ఆగిపోలేదు : క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్

డిస్కోరాజా ఆగిపోలేదు : క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్

మే 27 నుండి, జూన్ 21 వరకు హైదరబాద్ పరిసరాల్లో డిస్కోరాజా సెకండ్ షెడ్యూల్ జరగనుంది..

డిస్కోరాజా ఆగిపోలేదు : క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్

మే 27 నుండి, జూన్ 21 వరకు హైదరబాద్ పరిసరాల్లో డిస్కోరాజా సెకండ్ షెడ్యూల్ జరగనుంది..

మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్‌ల కాంబినేషన్‌లో డిస్కోరాజా.. సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా, ఎస్‌.ఆర్‌.టి. బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. నేల టికెట్ తర్వాత రవితేజతో ఆయన చేస్తున్న రెండో సినిమా ఇది. కొద్ది రోజులపాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందని, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మధ్య బడ్జెట్ విషయంలో జరిగిన డిస్కషనే ఇందుకు కారణం అని, రవితేజ, గోపిచంద్ మలినేనితో సినిమా చెయ్యబోతున్నాడని రకరకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలపై మూవీ యూనిట్ స్పందించింది.

‘డిస్కోరాజా ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసాం, అవుట్‌పుట్ బాగా వచ్చింది. సైన్స్ ఫిక్షన్ కథ కావడంతో గ్రాఫిక్స్ వర్క్‌కి ఎక్కువ టైమ్ పడుతుంది. డైరెక్టర్ పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు. అందుకే సెకండ్ షెడ్యూల్‌కి కాస్త ఎక్కవ గ్యాప్ వచ్చింది. మే 27 నుండి, జూన్ 21 వరకు హైదరబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుపుతాం’.. అని నిర్మాత చెప్పారు. థమన్ ఇప్పటికే రెండు పాటలు కంపోజ్ చేసినట్టు ట్వీట్ చేసాడు. డిస్కోరాజాని 2020 సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : అబ్బూరి రవి.

 

×