డిఫరెంట్‌గా ‘డిస్కోరాజా’ టీజర్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడికిల్ మూవీ ‘డిస్కోరాజా’ టీజర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : December 6, 2019 / 11:16 AM IST
డిఫరెంట్‌గా ‘డిస్కోరాజా’ టీజర్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడికిల్ మూవీ ‘డిస్కోరాజా’ టీజర్ రిలీజ్..

మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా.. ‘డిస్కోరాజా’.. సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

Image

శుక్రవారం సాయంత్రం ‘డిస్కోరాజా’ టీజర్ విడుదల చేశారు. రవితేజ గెటప్, చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. ‘ వీడైతే నో రికార్డ్స్, నో రిపోర్ట్స్, నో రిలేటివ్స్.. జీరో రిస్క్’ అంటూ హీరోని ఉద్దేశించి చెప్పే డైలాగుని బట్టి అతణ్ణి ఏదో పెద్ద ఆపరేషన్ కోసం ఎంచుకుంటారనిపిస్తోంది. ఫోటోగ్రఫీ, ఆర్ఆర్ అదిరిపోయాయి. డైరెక్టర్ టేకింగ్ హాలీవుడ్ స్థాయిలో ఉంది..

Image

జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల ముందుగానే జనవరి 24న ‘డిస్కోరాజా’ సినిమాను విడుదల చేయనున్నారు. ఎస్.ఆర్.టి. బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : అబ్బూరి రవి.