Jack Sparrow : జానీడెప్ కి సారీ చెప్పి 2300 కోట్ల డీల్‌ని ఆఫర్ చేసిన డిస్ని??

తాజాగా జానీడెప్ కి డిస్నీప్లస్ జాక్ స్పారో క్యారెక్టర్‌గా మళ్ళీ తిరిగి రావడానికి అతనికి సారీ చెప్పి ఏకంగా రూ.2,355 కోట్ల ($301 మిలియన్) డీల్ ఆఫర్ చేసినట్లు సమాచారం. డిస్నీ కంపెనీలోని...............

Jack Sparrow : జానీడెప్ కి సారీ చెప్పి 2300 కోట్ల డీల్‌ని ఆఫర్ చేసిన డిస్ని??

Johnny Depp

Johnny Depp :  హాలీవుడ్ స్టార్ హీరో జానీడెప్ పలు సినిమాలతో ప్రపంచమంతటా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సినిమాతో బాగా పాపులారిటీ సంపాదించాడు. ఇటీవల తన భార్యతో విడాకులు తీసుకొని తన భార్యపై పరువు నష్టం దావాలో గెలిచి వార్తల్లో నిలిచాడు జానీడెప్. ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సినిమాలో జాక్ స్పారో క్యారెక్టర్ ప్రేక్షకులకి బాగా చేరువైంది. ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన డిస్ని సంస్థతో జానీడెప్ కి వివాదం ఏర్పడటంతో వారితో ఉన్న సినిమాలని రద్దు చేసుకొని బయటకి వచ్చాడు.

అయితే తాజాగా జానీడెప్ కి డిస్నీప్లస్ జాక్ స్పారో క్యారెక్టర్‌గా మళ్ళీ తిరిగి రావడానికి అతనికి సారీ చెప్పి ఏకంగా రూ.2,355 కోట్ల ($301 మిలియన్) డీల్ ఆఫర్ చేసినట్లు సమాచారం. డిస్నీ కంపెనీలోని కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం డిస్నీప్లస్ అధికారికంగా జాక్ స్పారోకి క్షమాపణలు చెప్పి మళ్ళీ ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సినిమా సిరీస్ కోసం రావాలని అడుగుతూ 2300 కోట్ల డీల్ ని పంపింది అని తెలిపారు.

Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..

కార్పొరేట్ పద్దతితో జానీడెప్ కి క్షమాపణ లేఖతో ఓ బహుమతి బాస్కెట్‌ను పంపించింది డిస్నీ. ఇప్పటికే జాక్ స్పారో క్యారెక్టర్ ని ఆధారంగా తీసుకొని ఒక సినిమాని కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇది కూడా ఆ లేఖలో తెలిపింది. కాబట్టి ప్రపంచమంతటా ప్రేక్షకులు మెచ్చిన ఆ క్యారెక్టర్ కోసం అయినా తిరిగి రావాలని కోరింది. అయితే ఇప్పటివరకు జానీ డెప్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. జానీడెప్ కి ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ చేయడంతో హాలీవుడ్ నటులు కూడా ఆశ్చర్యపోతున్నారు.