Divi Vadthya : మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్‌బాస్ అమ్మడు..

తెలుగు బిగ్‌బాస్ షోతో ఎంతోమంది నటులు వెలుగులోకి వస్తున్నారు. ఇటీవల అలా ఫేమ్ లోకి వచ్చిన నటి 'దివి'. ఇప్పుడు ఈ నటి చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తాజాగా దివి పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది అంటా...

Divi Vadthya : మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్‌బాస్ అమ్మడు..

Divi Vadthya getting chance in pushpa 2

Divi Vadthya : తెలుగు బిగ్‌బాస్ షోతో ఎంతోమంది నటులు వెలుగులోకి వస్తున్నారు. ఇటీవల అలా ఫేమ్ లోకి వచ్చిన నటి ‘దివి’. ఈ అమ్మడు 2018లో ‘లెట్స్ గో’ అనే చిత్రంతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైనా, మంచి గుర్తింపు సంపాదించుకోలేదు. ఆ తరువాత బిగ్‌బాస్ షోలో ఛాన్స్ రావడం, ఆ ఫినాలిలో ఆమెకు మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలో ఛాన్స్ ఇస్తా అని మాట ఇవ్వడంతో.. ఈ ముద్దుగుమ్మ ఫేట్ మార్చేసింది.

Divi Vadthya: దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్న దివి..

చిరు అన్నట్టే గానే తన సినిమా గాడ్ ఫాదర్ మూవీలో దివికి ఒక ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడు. ఆ పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఈ నటి చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తాజాగా దివి పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది అంటా. అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో నటించడానికి దర్శకుడు సుకుమార్ దివిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

అంతేకాదు, దర్శకుడు సుకుమార్ ప్రముఖ టీవీ జర్నలిస్టుతో వర్క్ షాప్ నిర్వహించి దివికి శిక్షణ కూడా ఇప్పించాడని తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప టీమ్ హైదరాబాద్ లో రెండు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ రెండు పూర్తి అయ్యాక రెండు నెలలు షూటింగ్ కు కోసం బ్యాంకాక్ వెళ్లనున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.