Divi Vadthya: వారికి బిగ్‌బాస్ బ్యూటీ ఘాటు సమాధానం!

పొడవాటి సౌదర్యం.. చేపలాంటి కళ్ళు.. నవ్వితే సొట్ట పడే బుగ్గలు.. నడుస్తుంటే కుర్రాళ్ళ గుండెల్లో అడుగుల చప్పుడు.. ఇది దివి వాద్య. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటినటుల్లో దివి వాద్య పేరు ముందు వరసలో ఉంటుంది. బిగ్ బాస్ ముందు దివి పలు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఆ షోతో అందరినీ కట్టిపడేసింది.

Divi Vadthya: వారికి బిగ్‌బాస్ బ్యూటీ ఘాటు సమాధానం!

Divi Vadthya

Divi Vadthya: పొడవాటి సౌదర్యం.. చేపలాంటి కళ్ళు.. నవ్వితే సొట్ట పడే బుగ్గలు.. నడుస్తుంటే కుర్రాళ్ళ గుండెల్లో అడుగుల చప్పుడు.. ఇది దివి వాద్య. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటినటుల్లో దివి వాద్య పేరు ముందు వరసలో ఉంటుంది. బిగ్ బాస్ ముందు దివి పలు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఆ షోతో అందరినీ కట్టిపడేసింది.ఇక ఈ షో నుండి భయటకు వచ్చాక దివి అటు టీవీ షోలలో ఇటు వెబ్ సిరీస్ లలో సందడి చేస్తోంది.

మరోవైపు సోషల్ మీడియాలోనూ తన అందచందాలతో కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తోంది. అలా వెలిగిపోతున్న దివికి తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ టైమ్స్ లో 2020 మోస్ట్ డిజైరబుల్ టీవీ నటిగా దివి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉండగా దివి ఇటీవలే క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించగా.. త్వరలోనే మొదలు కానున్న మెగాస్టార్ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇక ఇటీవల దివి.. సిలక ముక్కు దానా అనే ప్రైవేటు సాంగ్‌లో మెరిసి మాస్‌ స్టేప్పులతో అలరించింది.

కాస‌ర్ల శ్యామ్ రాసిన ఈ పాటను హారిక నారాయ‌ణ్ పాడింది. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించగా.. ఈ పాట సూప‌ర్ హిట్‌గా నిలిచి 1.7 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ రాబట్టింది. అయితే ఇందులో దివి డ్యాన్స్‌ పై పలువురు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. అయితే.. వారికి దివి కూడా ఘాటుగానే సమాధానం చెప్పింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన దివి.. ఈ పాట కోసం, డ్యాన్స్‌ కోసం నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. నా డ్యాన్స్‌పై వస్తున్న విమర్శలను నేను పట్టించుకోను. అలాంటి వారికి ఈ పాట సాధించిన విజయం, వ్యూసే సమాధానం’ అంటూ చెప్పుకొచ్చింది.